close
Choose your channels

'సాహో' పోస్టర్‌ను హాలీవుడ్ నుంచి కాపీ కొట్టారా!?

Tuesday, May 21, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సాహో పోస్టర్‌ను హాలీవుడ్ నుంచి కాపీ కొట్టారా!?

టాలీవుడ్‌ టాప్ హీరోల్లో ఒకరైన రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సాహో’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై 'బాహుబలి' రికార్డ్స్‌ను బ్రేక్ హిస్టరీ క్రియేట్ చేసేంతలా రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. సర్‌ఫ్రైజ్ ఇస్తానంటూ ఒకరోజు ముందే చెప్పిన ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అనుకున్నట్లుగానే.. మంగళవారం నాడు పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌ చూసిన అభిమానులు, సినీ ప్రియులు, నటీ నటులు ప్రభాస్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

కాపీ కొట్టేశారా..?

అయితే ఆ పోస్టర్ హాలీవుడ్‌కు చెందిన ఓ టీవీ సీరిస్ నుంచి కాపీ కొట్టినట్లుగా తెలుస్తోంది. హాలీవుడ్‌ పోస్టర్‌ ‘బ్రేకింగ్ బ్యాడ్’ను.. సాహో పోస్టర్‌ను పక్కపక్కనే పెట్టి చూస్తే దాదాపు ఇంచుమించు రెండు ఒకేలా ఉండటం గమనార్హం. సో.. సాహో పోస్టర్ తయారు చేసిన డిజైనర్‌ హాలీవుడ్ నుంచి బాగానే ప్రభావితమైనట్లు దీన్ని బట్టి తెలుస్తోంది. కాగా.. మంగళవారం విడుదలైన ఈ పోస్టర్‌ సోషల్ మీడియాలో నిశితంగా గమనించిన నెటిజన్లు హాలీవుడ్ ‌నుంచి కాపీ కొట్టారని పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ కి సంబంధించిన పలు పోస్టర్లు బాలీవుడ్‌, హాలీవుడ్‌ సినిమాల నుంచే కాపీ కొట్టారని అప్పట్లో ఫొటోలను సైతం విడుదల చేస్తూ పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ తాజా వ్యవహారంపై ఇంతవరకూ చిత్రబృందం కానీ.. ప్రభాస్ కానీ రియాక్ట్ కాలేదు. రూ. 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు పలు భాషల్లో చిత్రీకరిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా అగ‌స్ట్ 15న ప్రపంచ‌ వ్యాప్తంగా ‘సాహో’ భారీ విడుదలకు సిద్ధమవుతోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.