ముగ్గురూ అందుకు ఒప్పుకుంటారా?

  • IndiaGlitz, [Saturday,November 02 2019]

బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను శాసిస్తున్న వారిలో ఖాన్‌ త్రయం ఎప్పుడూ ముందుంటుంది. ఈ ముగ్గురూ ముగ్గురే. తాజాగా వీరిలో ఆమిర్‌ ఖాన్‌ తన కొత్త చిత్రం లాల్‌సింగ్‌ చద్దాను స్టార్ట్‌ చేశాడు. ఆస్కార్‌ విన్నింగ్‌ మూవీ ‘ఫారెస్ట్‌ గంప్‌'కు ఇది రీమేక్‌. మన నెటివిటీకి తగినట్టు ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. శుక్రవారం సినిమా షూటింగ్‌ స్టార్టయ్యింది. ఈ సినిమా కోసం ఆమిర్‌ఖాన్‌ ఎప్పటిలాగానే తన శరీరాన్ని మార్చుకున్నారు.

బరువు తగ్గి కుర్రాడిలా తయారయ్యారు. ఆమిర్‌తో సీక్రెట్‌ సూపర్‌స్టార్‌ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు అద్వైత్‌ చందన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని క్రిస్మస్‌కు విడుదల చేయాలని అనుకుంటున్నారు.

అయితే ఈ సినిమాలో రెండు కీలకమైన అతిథి పాత్రలున్నాయి. ఆ పాత్రల్లో సల్మాన్‌ఖాన్‌, షారూక్‌ఖాన్‌లను నటింప చేస్తే సినిమాలో పాత్రలకే కాదు.. మార్కెట్‌ పరంగానూ బావుంటుందని ఆమిర్‌ భావిస్తున్నాడట. ఈ అతిథి పాత్రలో నటించడానికి షారూఖ్‌ ఖాన్‌ ఒప్పుకున్నాడని, ఇక సల్మాన్‌ మాత్రమే నటించాల్సి ఉందని వార్తలు వినపడుతున్నాయి. మరి సల్మాన్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచేస్తే ముగ్గురు ఖాన్స్‌ను ఒకేసారి వెండితెరపై చూడొచ్చు.

More News

త్వరలో వెండితెరపైకి రానున్న మౌనిక

బుల్లితెర వీక్షకులకు మౌనిక గుంటుక ఎవరో ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.

సూపర్ స్టార్ మహేష్ ప్రశంసలందుకున్న 'ఖైది'

యాంగ్రీ హీరో కార్తీ నటించిన డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఖైదీ’ దీపావళి బ్లాక్ బస్టర్ గా సూపర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది.

పవన్ కీలక నిర్ణయం: యువ ద‌ర్శ‌కుడితో జ‌ట్టు

2019 ఎన్నిక‌లు త‌ర్వాత జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తార‌నే వార్త‌లు ప్ర‌ముఖంగా విన‌ప‌డుతూనే ఉన్నాయి.

సూపర్ స్టార్ కు అరుదైన గౌర‌వం

సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఈ న‌వంబ‌ర్ 20 నుండి 28 వ‌ర‌కు గోవాలో జ‌ర‌గ‌బోయే గోల్డెన్ జూబ్లీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ (ఐఎఫ్ఎఫ్ఐ) అవార్డ్స్ 2019లో

పెళ్లికి ముందే తల్లి అయిన మరో హీరోయిన్!

బాలీవుడ్ భామ అమీజాక్సన్ పెళ్లి కాకుండానే గర్భం దాల్చి.. పండండి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.