close
Choose your channels

ముగ్గురూ అందుకు ఒప్పుకుంటారా?

Saturday, November 2, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ముగ్గురూ అందుకు ఒప్పుకుంటారా?

బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను శాసిస్తున్న వారిలో ఖాన్‌ త్రయం ఎప్పుడూ ముందుంటుంది. ఈ ముగ్గురూ ముగ్గురే. తాజాగా వీరిలో ఆమిర్‌ ఖాన్‌ తన కొత్త చిత్రం లాల్‌సింగ్‌ చద్దాను స్టార్ట్‌ చేశాడు. ఆస్కార్‌ విన్నింగ్‌ మూవీ ‘ఫారెస్ట్‌ గంప్‌'కు ఇది రీమేక్‌. మన నెటివిటీకి తగినట్టు ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. శుక్రవారం సినిమా షూటింగ్‌ స్టార్టయ్యింది. ఈ సినిమా కోసం ఆమిర్‌ఖాన్‌ ఎప్పటిలాగానే తన శరీరాన్ని మార్చుకున్నారు.

బరువు తగ్గి కుర్రాడిలా తయారయ్యారు. ఆమిర్‌తో సీక్రెట్‌ సూపర్‌స్టార్‌ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు అద్వైత్‌ చందన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని క్రిస్మస్‌కు విడుదల చేయాలని అనుకుంటున్నారు.

అయితే ఈ సినిమాలో రెండు కీలకమైన అతిథి పాత్రలున్నాయి. ఆ పాత్రల్లో సల్మాన్‌ఖాన్‌, షారూక్‌ఖాన్‌లను నటింప చేస్తే సినిమాలో పాత్రలకే కాదు.. మార్కెట్‌ పరంగానూ బావుంటుందని ఆమిర్‌ భావిస్తున్నాడట. ఈ అతిథి పాత్రలో నటించడానికి షారూఖ్‌ ఖాన్‌ ఒప్పుకున్నాడని, ఇక సల్మాన్‌ మాత్రమే నటించాల్సి ఉందని వార్తలు వినపడుతున్నాయి. మరి సల్మాన్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచేస్తే ముగ్గురు ఖాన్స్‌ను ఒకేసారి వెండితెరపై చూడొచ్చు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.