close
Choose your channels

ఎన్టీఆర్ 31 బ్యాక్‌డ్రాప్ అదేనా ?

Friday, May 29, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎన్టీఆర్ 31 బ్యాక్‌డ్రాప్ అదేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో ‘రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి కావాల్సిన ఈ చిత్రం కరోనా ప్రభావంతో ఆగింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. దీని తర్వాత ఎన్టీఆర్ తదుపరి చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో మొదలు కానుంది. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది. ఆర్ఆర్ఆర్ సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాతనే సినిమా ప్రారంభం కానుంది. దీని తర్వాత ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ కూడా పాన్ ఇండియా చిత్రంగానే తెరకెక్కనుంది. కె.జి.యఫ్ సినిమాను తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ తదుపరి ఎన్టీఆర్‌ను డైరెక్ట్ చేయనున్నారని సమాచారం.

తాజాగా వినపడుతున్న సినీ వర్గాల సమాచారం మేరకు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రాన్ని పీరియాడికల్ చిత్రంగా తెరకెక్కనుందట. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సినిమా తెరకెక్కనుందని అంటున్నారు. కె.జి.యఫ్ సినిమా కూడా పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లోనే తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కె.జి.యఫ్ చాప్టర్ 2 చిత్రీకరణ ముగిసిన తర్వాత ఎన్టీఆర్‌కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి చేయడానికి ప్రశాంత్ నీల్ ఫోకస్ పెట్టబోతున్నాడని సమాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.