close
Choose your channels

'మోస‌గాళ్ళు' క‌థ ఇదేనా?

Monday, March 30, 2020 • తెలుగు Comments

మోస‌గాళ్ళు క‌థ ఇదేనా?

మంచు విష్ణు హీరోగా నటిస్తూ 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిర్మిత‌మ‌వుతోన్న చిత్రం ‘మోస‌గాళ్ళు’. తెలుగుతో పాటు ఇంగ్లీష్‌లోనూ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు డైరెక్ట‌ర్ జెఫ్రీ గీ చిన్‌. కొంత మేర‌కు షూటింగ్ మాత్ర‌మే చేయాల్సి ఉంది. అతి పెద్ద ఐటీ స్కామ్ ఆధారంగానే ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నామ‌ని విష్ణు చెబుతూ వ‌చ్చారు. కానీ తాజాగా ఓ ప్రైవేట్ ఇంట‌ర్వ్యూలో మంచు విష్ణు మాట్లాడుతూ ఈ సినిమా రిలీజ్ స‌హా కొన్ని ఆసక్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలియ‌జేశారు.

‘ఆచార్య అమెరికాయాత్ర’ షూటింగ్ స‌మంలో న్యూస్ పేప‌ర్‌లో వ‌చ్చిన ఓ ఆర్టిక‌ల్‌ను ఆధారంగా చేసుకుని కొంత మంది ర‌చ‌యిత‌ల‌తో విష్ణు క‌థ‌ను డెవ‌ల‌ప్ చేయించాడ‌ట‌. ముందు సినిమాను ఇంగ్లీష్‌లోనే తీయాల‌నేది ఆలోచ‌న‌. అయితే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ స‌ల‌హాతో తెలుగులోనూ సినిమాను రూపొందించాల‌నుకున్నారు. క‌థ గురించి విష్ణు చెబుతూ ఓ అక్కా, త‌మ్ముడు క‌లిసి అటు అమెరిక‌న్‌, ఇటు ఇండియ‌న్ ప్ర‌భుత్వాల‌ను రూ.2700 కోట్లు మోసం చేశార‌ట‌. దాని ఆధారంగానే క‌థ‌ను సిద్ధం చేశామ‌ని అన్నారు. రిలీజ్ డేట్ గురించి చెబుతూ .. ముందు సినిమాను తెలుగులోనే విడుదల చేస్తున్నామని జూన్ 5న విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు మంచు విష్ణు.

Get Breaking News Alerts From IndiaGlitz