మెగా హీరోతో న‌టించ‌డానికి ఉపేంద్ర ఓకే చెబుతాడా?

  • IndiaGlitz, [Tuesday,March 10 2020]

ఈ ఏడాది 'ఎఫ్ 2', 'గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్' చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను త‌న ఖాతాలో వేసుకున్న యువ హీరో వ‌రుణ్ తేజ్‌. డిప‌రెంట్ సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపించే వ‌రుణ్ తేజ్ రెండు క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల త‌ర్వాత స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ చేయ‌డానికి రెడీ అయిపోయాడు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుగుతుంది. తాజా స‌మాచారం మేర‌కు ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌డానికి క‌న్న‌డ స్టార్ ఉపేంద్ర‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి త‌ర్వాత ఉపేంద్ర తెలుగులో న‌టించ‌లేదు. క‌న్న‌డ సినిమాలు, రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నాడు. ఈయ‌న్ని మ‌ళ్లీ న‌టింప చేయ‌డానికి చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌. మ‌రి ఉపేంద్ర ఏమంటాడో వేచి చూడాలి.

ఈ చిత్రంలో తల్లి పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ న‌టిస్తుంది. కాగా.. సినిమాను ఈ ఏడాది జూలై 30న విడుద‌ల చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. అలాగే బాలీవుడ్ ముద్దుగుమ్మ స‌యీ మంజ్రేక‌ర్‌హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని టాక్‌. ఈ సినిమా కోసం ఓలింపిక్ బాక్సింగ్ విన్న‌ర్ టోని జెఫ్రీస్ ద‌గ్గ‌ర ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ‌ను తీసుకుంన్నాడు. సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఈ స్పోర్ట్స్ డ్రామాలో బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి కూడా న‌టిస్తున్నాడు. మ‌రి ఈ సినిమాతో హిట్ కొట్టి.. వ‌రుణ్ తేజ్ హ్యాట్రిక్ కొడ‌తాడేమో వేచి చూడాలి.  ఈ సినిమా కోసం వ‌రుణ్ బాక్సింగ్‌లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో  రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో సిద్ధు ముద్ద‌, అల్లు వెంక‌టేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

More News

ఆలోచ‌న‌లో ప‌డ్డ బెల్లంకొండ హీరో!!

గ‌త ఏడాది రాక్ష‌సుడు సినిమాతో హిట్ కొట్టిన బెల్లంకొండ శ్రీనివాస్ ‘కందిరీగ‌’, ‘ర‌భ‌స’ చిత్రాల ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీనివాస్‌తో క‌లిసి సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

దేవుడా.. ఈ జనాల మనసు మార్చు!

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో అన్నదమ్ములు.. పవన్ కల్యాణ్ రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో.. నాగబాబు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘోర ఓటమిని చవి చూసిన సంగతి తెలిసిందే.

24 గంటలు గడవక మునుపే చంద్రబాబుకు ఊహించని షాక్..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు వరుస షాక్‌లు ఎక్కువయ్యాయి.

పవన్‌కు వరుస షాక్‌లు.. వైసీపీలో చేరిన కీలకనేత

‘పింక్’ రీమేక్ ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్‌లో బిజిబిజీగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు షాకింగ్ వార్త విన్నారు. అదేమిటంటే..

ఎన్టీఆర్‌ కొడుకు వదిలితే దూకేసేలా ఉన్నాడుగా..

సినిమా షూటింగ్‌లతో ఎంత బిజీబిజీగా ఉన్నా ఫ్యామిలీకే ప్రియారిటీ ఇచ్చే హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడన్న సంగతి తెలిసిందే.