close
Choose your channels

మెగా హీరోతో న‌టించ‌డానికి ఉపేంద్ర ఓకే చెబుతాడా?

Tuesday, March 10, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగా హీరోతో న‌టించ‌డానికి ఉపేంద్ర ఓకే చెబుతాడా?

ఈ ఏడాది `ఎఫ్ 2`, `గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్` చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను త‌న ఖాతాలో వేసుకున్న యువ హీరో వ‌రుణ్ తేజ్‌. డిప‌రెంట్ సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపించే వ‌రుణ్ తేజ్ రెండు క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల త‌ర్వాత స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ చేయ‌డానికి రెడీ అయిపోయాడు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుగుతుంది. తాజా స‌మాచారం మేర‌కు ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌డానికి క‌న్న‌డ స్టార్ ఉపేంద్ర‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి త‌ర్వాత ఉపేంద్ర తెలుగులో న‌టించ‌లేదు. క‌న్న‌డ సినిమాలు, రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నాడు. ఈయ‌న్ని మ‌ళ్లీ న‌టింప చేయ‌డానికి చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌. మ‌రి ఉపేంద్ర ఏమంటాడో వేచి చూడాలి.

ఈ చిత్రంలో తల్లి పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ న‌టిస్తుంది. కాగా.. సినిమాను ఈ ఏడాది జూలై 30న విడుద‌ల చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. అలాగే బాలీవుడ్ ముద్దుగుమ్మ స‌యీ మంజ్రేక‌ర్‌హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని టాక్‌. ఈ సినిమా కోసం ఓలింపిక్ బాక్సింగ్ విన్న‌ర్ టోని జెఫ్రీస్ ద‌గ్గ‌ర ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ‌ను తీసుకుంన్నాడు. సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఈ స్పోర్ట్స్ డ్రామాలో బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి కూడా న‌టిస్తున్నాడు. మ‌రి ఈ సినిమాతో హిట్ కొట్టి.. వ‌రుణ్ తేజ్ హ్యాట్రిక్ కొడ‌తాడేమో వేచి చూడాలి.  ఈ సినిమా కోసం వ‌రుణ్ బాక్సింగ్‌లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో  రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో సిద్ధు ముద్ద‌, అల్లు వెంక‌టేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.