మాల్దీవ్స్‌లో పాట చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న 'ఇస్మార్ట్ శంక‌ర్‌'

  • IndiaGlitz, [Friday,June 14 2019]

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేశ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం 'ఇస్మార్ట్ శంకర్‌'. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కుడు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది.

ప్ర‌స్తుతం సినిమాలో ఓ రొమాంటిక్ సాంగ్‌ను రామ్‌, నిధి అగ‌ర్వాల్‌ల‌పై మాల్దీవుల్లో చిత్రీక‌రిస్తున్నారు. భాస్క‌ర భ‌ట్ల ర‌చించిన 'లవ్‌' సాంగ్‌ను మాల్దీవుల్లోని అంద‌మైన లొకేష‌న్స్‌లో ఈ పాట‌ను చిత్రీక‌రిస్తుండ‌టం విశేషం. మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వ‌హిస్తున్నారు.

రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్‌కు, దిమాక్ ఖ‌రాబ్ అనే సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుండి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను జూలై 12న విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

More News

2024లో జగన్‌పై గెలిచేందుకు ‘పీకే’తో టీడీపీ డీల్!

టైటిల్ చూడగానే కాసింత ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ.. అవును మీరు వింటున్నది నిజమే.. 2019 ఎన్నికల్లో వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్..

చంద్రబాబుకే అర్థంకాక తలపట్టుకున్నారట..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో వైసీపీ విజయ దుందుభి మోగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

 వైఎస్ జగన్ సూపర్బ్.. చూసి నేర్చుకో కేసీఆర్!

ఒకప్పుడు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెల్లెల్లిగా పార్టీలో ఉన్న విజయశాంతి అలియాస్ రాములక్క..

మాటిచ్చా.. నిలబెట్టుకుంటా.. జనవరి-26న రూ. 15వేలు ఇస్తాం!

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక జెడ్పీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన ‘రాజన్న బడి బాట’ కార్యక్రమం జరిగింది.

కిషన్‌రెడ్డికి కాల్ చేసి బెదిరించింది వాళ్లేనా!?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిన గంగాపురం కిషన్‌రెడ్డి..