close
Choose your channels

మాల్దీవ్స్‌లో పాట చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న 'ఇస్మార్ట్ శంక‌ర్‌'

Friday, June 14, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేశ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం `ఇస్మార్ట్ శంకర్‌`. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కుడు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది.

ప్ర‌స్తుతం సినిమాలో ఓ రొమాంటిక్ సాంగ్‌ను రామ్‌, నిధి అగ‌ర్వాల్‌ల‌పై మాల్దీవుల్లో చిత్రీక‌రిస్తున్నారు. భాస్క‌ర భ‌ట్ల ర‌చించిన `లవ్‌` సాంగ్‌ను మాల్దీవుల్లోని అంద‌మైన లొకేష‌న్స్‌లో ఈ పాట‌ను చిత్రీక‌రిస్తుండ‌టం విశేషం. మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వ‌హిస్తున్నారు.

రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్‌కు, దిమాక్ ఖ‌రాబ్ అనే సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుండి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను జూలై 12న విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.