ఐదేళ్లయ్యింది.. ఏం చేసావో చెప్పు?: కేసీఆర్‌పై అమిత్ షా ఫైర్

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ సారి మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందన్నారు.
ఒక్కసారి అవకాశం ఇస్తే వరద ప్రవాహానికి అడ్డంగా ఉన్న ఇళ్లను తొలగిస్తామని అమిత్ షా తెలిపారు. గుడ్ గవర్నెన్స్‌ను అమలు చేస్తామని.. అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఆయుష్మాన్ భారత్ అమలు చేయకుండా పేదలకు కార్పోరేట్ వైద్యం దూరం చేశావని కేసీఆర్‌ను విమర్శించారు. జాతీయ రహదారులు నిర్మించామని.. పీఎం స్ట్రీట్ వెండర్ యోజన స్కీం ద్వారా మూడు లక్షల మంది లబ్ది పొందారని అమిత్ షా వెల్లడించారు.

కేసీఆర్‌పై ప్రశ్నల వర్షం..

‘‘హైదరాబాద్ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ఉన్నారు? ప్రధాని మోదీ ఏం చెప్తే అది చేస్తాడు.. ఐదేళ్ళు అయ్యింది.. ఏం చేసావో చెప్పు..? సిటిజన్ చాప్టర్ ఏమైంది? లక్ష ఇల్లు ఏమయ్యాయి? మూసీ నదిపై ఆరు లైన్ల రోడ్ ఏమైంది? 15 డంప్ యార్డులు ఏమయ్యాయి? పదివేల కోట్ల ఖర్చు ఎక్కడ చేశావు? హుస్సేన్ సాగర్ ప్రక్షాళన ఏమైంది? ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులపై భారం తగ్గించేందుకు నాలుగు ఆసుపత్రులు కడతానన్నావ్ ఏమయ్యాయి? మజ్లీస్‌తో కలిస్తే మాకేం ఇబ్బంది లేదు.. కానీ గుప్తంగా ఎందుకు? మీ కుటుంబం మినహా ఇంకెవరూ లేరా? ’’ అంటూ కేసీఆర్‌పై అమిత్‌ షా ప్రశ్నల వర్షం కురిపించారు.

ఇంట్లో కూర్చొని సీట్లు పంచుకుంటావు..

వర్క్ ఫ్రం హోం నుంచి వర్క్ ఫ్రం ఎనీవేర్ పద్ధతిని మోదీ తీసుకొచ్చారని అమిత్ షా కొనియాడారు. దీని ద్వారా హైదరాబాద్ యువతకు లబ్ది దక్కిందన్నారు. స్టార్టప్ కోసం ప్రత్యేక నిధులు ఇచ్చారని వెల్లడించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, హైదరాబాద్ మినీ భారత్.. హైదరాబాద్‌కు నిజాం కల్చర్ నుంచి బయట వేసి కొత్తనగరం నిర్మిస్తామన్నారు. డైనెస్టీ నుంచి డెమోక్రసీ వైపు రాష్ట్రాన్ని నడిపిస్తామన్నారు. అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇంట్లో కూర్చొని సీట్లు పంచుకుంటావని విమర్శించారు. ఒక్కసారి తమకు అవకాశం ఇస్తే రోహింగ్యాలను తరిమికొడతానన్నారు. కేవలం అమ్మవారి దర్శనం కోసమే వచ్చానని అమిత్ షా వెల్లడించారు. ఏ ఎన్నికలనూ ఈజీగా తీసుకోబోమన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తామన్నారు.

More News

ఎమ్మెల్సీ కవితకు బండ్ల గణేష్ కౌంటర్..

నిర్మాత, నటుడు బండ్ల గణేష్ పేరును ప్రస్తావిస్తూ.. బండి సంజయ్.. ఆయనకు మించిన కమెడియన్ అయ్యారని కేసీఆర్ తనయురాలు..

డిజిటల్ ప్రొవైడర్ల గుత్తాధిపత్యం సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి - ప్రొడ్యూసర్ మోహన్ వడ్లపట్ల

సినిమా థియేటర్లు రీ-ఓపెనింగ్‌తో పాటు రూ.10 కోట్ల లోపు బడ్జెట్‌తో నిర్మించే సినిమాలకు జీఎస్టీ రీయింబర్స్‌మెంట్ ఇస్తామంటూ తెలంగాణ ప్రభుత్వం

మరోసారి ఆ డైరెక్టర్‌తో బాలయ్య..?

బాలకృష్ణ తన 106వ సినిమాను పూర్తి చేసే పనిలో ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు.

టెన్షన్‌కు తెర తీసిన సూపర్‌స్టార్‌

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ మరోసారి టెన్షన్‌ను క్రియేట్‌ చేశారు. ప్రజలకు, అభిమానులకు మాత్రం కాదు..

తల్చుకుంటే దుమ్ము దుమ్ము... నశం కింద కొడతా: కేసీఆర్

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎల్బీస్టేడియంలో నేడు భారీ బహిరంగ సభ నిర్వహించింది.