దుబాయ్‌లో 'జై సింహా'

  • IndiaGlitz, [Monday,November 27 2017]

నటసింహ బాలకృష్ణ నటిస్తున్న 102వ చిత్రం 'జై సింహా'. న‌య‌న‌తార‌, హ‌రిప్రియ‌, న‌టాషా దోషి క‌థానాయిక‌లు. కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సి.కె.ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్ పై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న‌ ఈ సినిమాకి చిరంత‌న్ భ‌ట్ సంగీత‌మందిస్తున్నారు. కాగా, ఈ సినిమా చివ‌రి షెడ్యూల్ ని దుబాయ్‌లో ప్లాన్ చేశారు.

ఈ షెడ్యూల్‌లో భాగంగా.. డిసెంబర్ 7 నుంచి 17వ తేదీ వరకు దుబాయ్ లో రెండు సాంగ్స్‌ని షూట్ చేయ‌డానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అందులో ఒక పాట‌ను బాలకృష్ణ, నయనతార పై.. రెండో పాట‌ను బాలకృష్ణ, నటాషా దోషిపై పిక్చ‌రైజ్ చేయ‌నున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన బాల‌కృష్ణ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కి మంచి స్పంద‌న వ‌చ్చింది.

డిసెంబ‌ర్ నెలాఖ‌రులో ఈ సినిమా ఆడియోని విడుద‌ల చేయ‌నున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. సింహా, శ్రీ‌రామ‌రాజ్యం త‌రువాత బాల‌య్య‌, న‌య‌న్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై మంచి అంచ‌నాలే ఉన్నాయి.

More News

బ‌న్ని బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘నా పేరు సూర్య’. ర‌చ‌యిత వక్కంతం వంశీ మొదటిసారిగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

'ఒక్క క్ష‌ణం' వాయిదా ప‌డ‌నుందా?

సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇప్పటికే ఈ ఏడాదిలో ఐదు సినిమాలను విడుదల చేసారు. ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ సినిమాగా నాని నటించిన 'ఎం.సి.ఎ.' కూడా రిలీజ్ కి సిద్దంగా ఉంది. అయితే ఈ సినిమాను డిసెంబర్ 21న రిలీజ్ చేయాలని నిశ్చయించారు.

విశాల్ 'అభిమన్యుడు' మోషన్ పోస్టర్ విడుదల

మాస్ హీరో విశాల్ ఇటీవల విడుదలైన 'డిటెక్టివ్'తో మరో సూపర్హిట్ని అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న 'అభిమన్యుడు'.

'సైరా' నుండి తప్పుకున్న రెహమాన్

ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీత సారథ్యంలో మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం `సైరా నరసింహా రెడ్డి` సినిమా ఉంటుందని ముందు యూనిట్ ప్రకటించింది. అయితే ఒక్కొక్క టెక్నిషియన్ సినిమా నుండి తప్పుకుంటున్నారు.

'ఖాకి'కి శంకర్ అభినందన

కార్తి, రకుల్ జంటగా నటించిన చిత్రం `ఖాకి`. హెచ్.వినోద్ దర్శకత్వంలోరూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో ఆదిత్యమ్యూజిక్ రిలీజ్ చేసింది. 1995-2005లో నిజ ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.