జనసైనికుడిపై ఎమ్మెల్యే వీరంగం.. మనస్థాపంతో ఆత్మహత్య

  • IndiaGlitz, [Monday,January 18 2021]

జనసేన కార్యకర్తపై ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబు విరుచుకు పడ్డారు. తమ గ్రామ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినందుకు జనసైనికుడు ఆయన ఆగ్రహానికి గురవడం గమనార్హం. నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యే రాంబాబు బేస్తవారిపేట మండలంలోని సింగరపల్లికి వెళ్లారు. అక్కడ జనసేన కార్యకర్త వెంగయ్య తమ గ్రామ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆగ్రహం పట్టలేక ఎమ్మెల్యే రాంబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు .

అంతటితో ఆగక ఎమ్మెల్యే రాంబాబు తిట్ల పురాణం అందుకున్నట్టు తెలుస్తోంది. దీంతో సోమవారం వెంగయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంగయ్య ఆత్మహత్యకు ఎమ్మెల్యే అనుచరుల బెదిరింపులే కారణమని జనసేన కార్యకర్తలు చెబుతున్నారు. అయితే మానసిక స్థితి సరిగా లేకనే వెంగయ్య ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఎమ్మెల్యే రాంబాబు తిట్ల పురాణానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More News

‘ఇది మహాభారతం కాదు’.. టైటిల్‌లోనే పిచ్చ క్లారిటీ ఇస్తున్నా: వర్మ

దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం తీసినా సంచలనమే.. ఏం మాట్లాడినా సంచలనమే. ఇప్పటి వరకూ ఆయన భయపెట్టినా..

ఎమ్మెల్యేను ప్రశ్నించడమే వెంగయ్య చేసిన తప్పా?: పవన్

తమ గ్రామ సమస్యలను గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబు దృష్టికి తీసుకెళ్లినందుకు జనసైనికుడు వెంగయ్యనాయుడిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే.

త‌మ్ముడు బాట‌లో అన్న‌..!

సాధార‌ణంగా మన ఇంట్లో పెద్ద‌వారు చిన్న‌వారికి మార్గ‌ద‌ర్శకంగా నిలుస్తుంటారు. కానీ అతి కొద్ది సంద‌ర్భాల్లో మాత్ర‌మే చిన్న‌వారిని పెద్ద వారు అనుక‌రిస్తుంటారు.

చిరు ‘లూసిఫ‌ర్‌’లో ఆ పాత్ర ఉండ‌దా..?

మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రంగా మ‌ల‌యాళ చిత్రం ‘లూసిఫ‌ర్’ రీమేక్ కానున్న సంగ‌తి తెలిసిందే.

ర‌ష్మిక‌కు మాటిచ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

విజ‌య్ దేవ‌ర‌కొండ, హీరోయిన్ మంచి స్నేహితులు. గీత గోవిందం, డియ‌ర్ కామ్రేడ్ చిత్రాల్లో క‌లిసి న‌టించారు.