close
Choose your channels

Pawan Kalyan:‘‘పాపం పసివాడు’’ పోస్టర్ పెట్టి... పొద్దుపొద్దున్నే జగన్‌పై పవన్ సెటైర్లు, ర్యాగింగ్ మామూలుగా లేదుగా

Wednesday, May 17, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై పొద్దు పొద్దున్నే సెటైర్లు వేశారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. బుధవారం ట్వీట్టర్ ద్వారా స్పందించిన ఆయన బ్లాక్ అండ్ వైట్ సినిమా ‘‘పాపం పసివాడు’’ పోస్టర్‌ను వదిలారు. దీనితో పోల్చుతూ జగన్‌ అమాయకుడంటూ ర్యాగింగ్ చేశారు పవన్. ఈ సినిమాను జగన్‌తో ఎవరైనా రీమేక్ చేయాలని ఆయన కామెంట్స్ చేశారు. ఆ పోస్టర్‌లో ఓ చిన్నారి సూట్‌కేసు పట్టుకుని.. దారి తెన్నూ తెలియక నడుచుకుంటూ పోతున్నట్లుగా వుంటుంది. అయితే ఇందులో చిన్న మార్పు చేయాలని.. జగన్ చేతిలో సూట్‌ కేసుకి బదులుగా ఆయన అక్రమంగా సంపాదించిన సంపద కోసం మనీలాండరింగ్‌ను సులభతరం చేసే సూట్‌కేస్ కంపెనీలు వుంచాలని ఎద్దేవా చేశారు.

మీరేమి పుచ్చలపల్లి సుందరయ్య కాదు :

మీరేమి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి కాదన్నారు. మీ అక్రమార్జనతో , ప్రజలపై మీరు సాగిస్తున్న హింసతో క్లాష్ వార్ అనే పదాన్ని ఉచ్చరించడానికి కూడా హక్కు లేదంటూ పవన్ తీవ్రవ్యాఖ్యలు చేశారు, ఏదో ఒక రోజు రాయలసీమ మీ నుంచి, మీ గుంపు నుంచి విముక్తి అవుతుందని పవన్ వ్యాఖ్యానించారు. చివరిలో ఈ సినిమాకు రాజస్థాన్‌లోని ఇసుక ఏడారులు అవసరం అని అయితే జగన్‌తో సినిమా చేయాలనుకుంటే మాత్రం అక్కడి దాకా వెళ్లాల్సిన అవసరం లేదని పవన్ పేర్కొన్నారు. ఏపీ నదుల నుంచి తవ్వి తీసిన ఇసుక కలెక్షన్ పాయింట్‌లలో ఎడారి అంత ఇసుక వుందని అక్కడే షూటింగ్ చేసుకోవచ్చని పవన్ కల్యాణ్ సెటైర్లు వేశారు. ప్రస్తుతం జనసేనాని ట్వీట్ వైరల్ అవుతోంది.

ఈసారి ఖచ్చితంగా పొత్తులతోనే అన్న పవన్ :

ఇదిలావుండగా.. వచ్చే ఏపీ ఎన్నికల్లో తాము పొత్తులతోనే ముందుకు వెళ్తామన్నారు పవన్ కల్యాణ్. తమకు బలమున్న చోట పోటీ చేస్తామని.. తనకు వచ్చే సీట్లను బట్టి సీఎం పదవిని డిమాండ్ చేస్తామని ఆయన ఇటీవల జనసేన మండల, డివిజన్ స్థాయి నేతలతో సమావేశం సందర్భంగా అన్నారు. గత ఎన్నికల్లో తనకు 30 నుంచి 40 స్థానాలు ఇచ్చి వుంటే సీఎం రేసులో వుండేవాడినని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పవన్ తెలిపారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసే పోటీ చేస్తాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.