'జ‌వాన్' ట్రైల‌ర్ రివ్యూ...

  • IndiaGlitz, [Thursday,November 23 2017]

సాయిధ‌ర‌మ్ తేజ్‌, మెహ‌రీన్ జంట‌గా న‌టించిన చిత్రం 'జ‌వాన్'. అరుణాచ‌ల క్రియేష‌న్స్ ప‌తాకంపై కృష్ణ సినిమాను నిర్మించాడు. బి.వి.ఎస్‌.ర‌వి ద‌ర్శ‌కుడు. డిసెంబ‌ర్ 1న సినిమా విడుద‌ల‌వుతుంది.

ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌లైంది. ట్రైల‌ర్‌ను బ‌ట్టి చూస్తే సినిమా రెండు అంశాల చుట్టూ తిరుగుతుంది. ఒక‌టి దేశం..రెండోది కుటుంబం. డి.ఆర్‌.డి.ఒ డిపార్ట్‌మెంట్‌వాళ్లు దేశానికి యుద్ధంలో తోడ్ప‌డేలా ఏదో ప్లాన్ చేసి త‌యారు చేస్తారు. దాన్ని విల‌న్ చేజిక్కించుకోవాల‌నుకుంటాడు.

అది హీరో చేతికి దొరుకుతుంది. దాంతో విల‌న్ హీరో కుంటుంబాన్ని టార్గెట్ చేస్తాడు. విల‌న్ భారి నుండి దేశాన్ని, త‌న కుటుంబాన్ని హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ఎలా చేజిక్కించుకున్నాడ‌నేదే సినిమా.

యుద్ధంలో మ‌న ప‌క్క‌వాడు కూల్చాడా? పోయాడా? అని కాదు యుద్ధం గెలిచామా? లేదా? అనేదే ముఖ్యం అంటూ సాయిధ‌రమ్ తేజ్ చెప్పే డైలాగ్ బావుంది. సినిమా యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంతో పాటు ఫ్యామిలీ ఎమోష‌న్స్ మిళితంగా ఉంటుంది.

More News

'ఖాకి' ప్రమోషన్స్పై సంతోషాన్ని వ్యక్తం చేసిన కార్తి,రకుల్

తెలుగులో రెండు దశాబ్దాలుగా ఆడియో రంగంలో టాప్ పోజిషన్లో ఉన్న ఆదిత్య మ్యూజిక్..తొలిసారి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మాతలుగా 'ఖాకి' చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు.

ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల్లోకి రావ‌డం లేదు...

ఈ మ‌ధ్య త‌మిళ‌నాడు రాజ‌కీయాలు వార్త‌ల్లో  నిలుస్తున్నాయి. ప్రేక్ష‌కుల్లో మాస్ ఇమేజ్ ఉన్న ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్ హాస‌న్‌లు రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌ని వార్త‌లు వినిపించాయి.

డిసెంబర్ 8న సుమంత్ మళ్లీ రావా చిత్రం

శ్రీ నక్క యాదగిరి స్వామి ఆశీస్సులతో స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సుమంత్ హీరోగా, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్ర దారులుగా గౌతమ్ తిన్న సూరి దర్శకత్వంలోరాహుల్ నక్క నిర్మించిన రొమాంటిక్ డ్రామా 'మళ్లీ రావా' ఈ చిత్రం ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ 8న విడుదలకు సిద్ధంగా ఉండడంతో ఈ చిత్ర ఆడియో టీజర్ ను వి

ఇద్ద‌రిలో ఎవ‌రితో...

క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను ప్రేక్ష‌కులు మెచ్చే విధంగా తెర‌కెక్కించ‌గ‌ల ద‌ర్శ‌కుల్లో వినాయ‌క్ ముందుంటారు. ఈయ‌న ఇప్పుడు సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కాగానే వినాయ‌క్ చేయ‌బోయే సినిమాకు ఇద్ద‌రు హీరోల పేర్లు వినప‌డుతున్నాయి.

'సప్తగిరి ఎల్‌ ఎల్‌ బి' చిత్రంలో సప్తగిరి డాన్సులు ఇరగదీశాడు - వి.వి.వినాయక్‌

కామెడీ కింగ్‌ సప్తగిరి కథానాయకుడిగా 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని నిర్మించిన సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై లిమిటెడ్‌ అధినేత డా.రవికిరణ్‌ మళ్లీ సప్తగిరి హీరోగా 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.