‘శేఖర్’ మూవీ వివాదంలో జీవితా రాజశేఖర్‌దే గెలుపు.. న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు

యాంగ్రీ యంగ్‌మెన్ డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించిన మూవీ శేఖర్. ఆయన కెరీర్‌లో ఇది 91వ సినిమా. ఈ చిత్రానికి జీవితా రాజశేఖర్ దర్శకత్వం, స్క్రీన్ ప్లే కూడా అందించారు. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో, పెగాసస్ సినీకార్ప్, టారస్ సినీకార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించారు. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్‌తో నడుస్తోంది. ఈ చిత్రంలో రాజశేఖర్ సరసన ఆత్మీయ రాజన్, ముస్కాన్ హీరోయిన్లుగా నటించారు. ఇందులో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక కూడా నటించడం విశేషం.

అయితే.. ఫైనాన్షియర్ పరంధామరెడ్డి వేసిన కేసు కారణంగా సినిమా ప్రదర్శన నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం జీవితా రాజశేఖర్ తన వద్ద రూ. 65 లక్షలు అప్పుగా తీసుకున్నారని పరంధామ రెడ్డి కోర్టుకెక్కాడు. సినిమా విడుదల సందర్భంగా బాకీ తీరుస్తామని మాట ఇచ్చారని... కానీ తనకు రావాల్సిన మొత్తాన్ని జీవితా రాజశేఖర్ చెల్లించలేదని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నాడు. దీనిపై విచారణ జరిపిన సిటీ సివిల్ కోర్టు ... జీవితా రాజశేఖర్ 48 గంటల్లోగా రూ. 65 లక్షలను సెక్యూరిటీ డిపాజిట్ కింద కోర్టులో సమర్ఫించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే కోర్టు ఆదేశించినా డబ్బు చెల్లించకపోవడంతో శేఖర్ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని న్యాయస్థానం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. సినిమా ప్రదర్శన నిలిచిపోవడంతో డాక్టర్ రాజశేఖర్ దంపతులు ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమా కోసం తమ కుటుంబం ఎంతగానో కష్టపడిందని పేర్కొన్నారు. కొందరు కుట్రలు చేసి సినిమా ప్రదర్శనను అడ్డుకున్నారని రాజశేఖర్ ఆదివారం సంచలన పోస్ట్ చేశారు.

అయితే తాజా వివాదంలో జీవితా రాజశేఖర్, శేఖర్ చిత్రబృందం పైచేయి సాధించినట్లుగా తెలుస్తోంది. వీరికి అనుకూలంగా కోర్టులో న్యాయమూర్తి మాట్లాడినట్టుగా ప్రచారం జరుగుతోంది. ‘శేఖర్’ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని తామెప్పుడూ చెప్పలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. కొంతమంది ఉద్దేశపూర్వకంగా సినిమా ప్రదర్శనకు ఆటంకం కలిగించారని... అయితే, కోర్టు సినిమా ప్రదర్శనకు ఎటువంటి అభ్యంతరం తెలపలేదని సమాచారం. జీవితా రాజశేఖర్, నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి తరపు న్యాయవాదులు మంగళవారం విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం వుంది.

More News

దిగ్గజ నటుడు టీ.రాజేందర్‌కు తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చికిత్స

దిగ్గజ నటుడు, నిర్మాత, దర్శకుడు టీ.రాజేందర్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది.

ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న విజయ్ దేవరకొండ, సమంత 'ఖుషి'

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ సినిమా "ఖుషి" ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

ఇకపై మహిళల కోసం సినిమాలు చేస్తా .. పెద్ద కలలు కనండి: భారతీయ అమ్మాయిలకు పూజా హెగ్డే సూచనలు

ప్రస్తుతం సౌత్‌తో పాటు నార్త్‌లోనూ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది పూజాహెగ్డే. ‘‘ఒక లైలా కోసం’’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది

వనజీవి రామయ్యకు పవన్ పరామర్శ.. వీడియో కాల్ చేసి యోగక్షేమాలు తెలుసుకున్న జనసేనాని

రోడ్డు ప్రమాదానికి గురై ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ పర్యావరణ పరిరక్షకుడు, పద్మశ్రీ వనజీవి రామయ్యను జనసేన అధినేత పవన్ కళ్యాణ్

అంబరాన్నంటిన ర్యాలీ "ఆటా" అందాల పోటీలు

జూలై 1 నుండి 3వ తేదీ వరకు వాషింగ్టన్ డి.సి.లో జరిగే 17వ అటా కన్వెన్షన్ మరియు యూత్ కాన్ఫరెన్స్ లో భాగంగా మే 14వ తేదీన రాలీ,