అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ ఘన విజయం

  • IndiaGlitz, [Sunday,November 08 2020]

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రట్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ ఘన విజయం సాధించారు. తుది ఫలితం పెన్సెల్వేనియాలో ప్రకటించడంతో జో బిడెన్ గెలిచినట్లు అధికారికంగా ప్రకటించారు. పెన్సెల్వేనియాలో మొత్తం 20 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. కాగా.. పెన్సిల్వేనియాలో జో బిడెన్ ఆధిక్యం కనబరిచారు. దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితంపై జో బిడెన్ స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు. 538 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లకు గాను.. జో బిడెన్‌కు మొత్తం 284 ఎలక్టోరల్ ఓట్లు రాగా.. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌కు 214 ఎలక్టోరల్ ఓట్లు లభించాయి.
 
స్పష్టమైన మెజారిటీ జో బిడెన్‌కు లభించడంతో 46వ అమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్ ఎన్నికయ్యారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ఎన్నికయ్యారు. అంతేకాదు, అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళగా, తొలి నల్ల జాతీయురాలిగా, తొలి ఆసియన్ అమెరికన్‌గా కమలా హారిస్ చరిత్ర సృష్టించారు. నార్త్ కరోలినా ఫలితం తేలకపోవడంతో ట్రంప్‌కు ఇప్పటివరకూ 214 ఎలక్టోరల్ ఓట్లు మాత్రమే వచ్చాయి.

More News

దుబ్బాక ఎన్నికకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలివే

ఇటీవలి కాలంలో దుబ్బాక ఉపఎన్నిక రాజకీయంగా దుమ్ము రేపింది. ఈ మధ్యకాలంలో ఇంతటి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నిక మరొకటి లేదనే చెప్పాలి.

కేసీఆర్‌ను కలిసిన చిరు, నాగ్.. గుడ్ న్యూస్ చెప్పిన సీఎం

టాలీవుడ్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో శనివారం సాయంత్రం భేటీ అయ్యారు. నేడు ప్రగతి భవన్‌కు వెళ్లిన చిరు, నాగ్.

క‌మ‌ల్ 232వ చిత్రం`విక్ర‌మ్`..టీజ‌ర్ విడుద‌ల‌

యూనివర్సల్‌ హీరో కమల్‌ హాసన్‌ హీరోగా ఇటీవలే 'ఖైదీ' సినిమాతో తెలుగు, తమిళ భాషల్లో భారీ హిట్‌ ఖాతాలో వేసుకున్న టాలెంటెడ్ డైరెక్ట‌ర్ లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో

భూమిని కొన్న ఏడాది తర్వాత.. ధరణి పోర్టల్ చూసి నల్గొండ జిల్లా వాసి షాక్..

వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల వివరాల నమోదు ప్రక్రియ కోసం తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్ ప్రారంభించిన విషయం తెలిసిందే.

మెట్రోలో ఉద్యోగం పోవడంతో... హెర్బల్ టీతో అమెజాన్‌ను మెప్పించాడు..

కరోనా మహమ్మారి ఎందరి జీవితాలనో ఛిద్రం చేసేసింది. కానీ కొందరి జీవితాల్లో మాత్రం వెలుగులు నింపింది.