close
Choose your channels

కేసీఆర్‌ను కలిసిన చిరు, నాగ్.. గుడ్ న్యూస్ చెప్పిన సీఎం

Saturday, November 7, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కేసీఆర్‌ను కలిసిన చిరు, నాగ్.. గుడ్ న్యూస్ చెప్పిన సీఎం

టాలీవుడ్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో శనివారం సాయంత్రం భేటీ అయ్యారు. నేడు ప్రగతి భవన్‌కు వెళ్లిన చిరు, నాగ్.. కేసీఆర్‌తో పలు కీలక విషయాలపై చర్చించారు. ముఖ్యంగా తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి-విస్తరణపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. దాదాపు 10 లక్షల మంది తెలంగాణలో చిత్ర పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. లాక్‌డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమ కుదేలైందన్నారు. ఎందరో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు.

ఇప్పుడిప్పుడే పరిస్థితులు మళ్లీ నార్మల్ అవుతున్నాయన్నారు. షూటింగ్‌లను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పున:ప్రారంభించాలన్నారు. అలాగే థియేటర్లను ఓపెన్ చేస్తే చిత్ర పరిశ్రమపై ఆధారపడి బతికే కుటుంబాలు కష్టాల నుంచి బయట పడతాయని కేసీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయని.. ఇది కాస్మో పాలిటన్ సిటీ అన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు, వివిధ భాషలకు చెందిన వారంతా హైదరాబాద్‌లోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారన్నారు.

చిత్ర షూటింగ్‌లకు, సినిమా నిర్మాణ ప్రక్రియకంతటికీ ఇది అనువైన ప్రదేశమని కేసీఆర్ పేర్కొన్నారు. అలాగే నాగ్.. చిరులకు సీఎం కేసీఆర్ ఓ గుడ్ న్యూస్ కూడా చెప్పారు. ప్రభుత్వం ఫిలిం సిటీ ఆఫ్ హైదరాబాద్‌ను నిర్మించాలనే ఆలోచనలో ఉందనే శుభవార్తను వెల్లడించారు. దీనికోసం ప్రభుత్వం 1500-2000 ఎకరాల స్థలాన్ని సేకరించి ఇస్తుందన్నారు. ఆ స్థలంలో భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు అంతర్జాతీయ స్థాయిలో స్టూడియోలు నిర్మించుకునేందుకు సినిమా నిర్మాణ సంస్థలకు ప్రభుత్వం స్థలం కేటాయిస్తుందని కేసీఆర్ తెలిపారు. కాగా.. ప్రభుత్వ అనుమతితో షూటింగ్‌లు ప్రారంభించామని.. త్వరలోనే థియేటర్లను సైతం తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చిరు, నాగ్ తెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos