ఎన్టీఆర్ - కొరటాల మూవీ స్టోరీ లైన్ ఇదే.. !!

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌తో కలిసి ఎన్టీఆర్ నటించిన ‘‘ఆర్ఆర్ఆర్’’ విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాస్త విరామం దొరకడంతో ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి యూరప్ టూర్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నటించనున్నారు. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'జనతా గ్యారేజ్' వంటి సూపర్ హిట్ రావడం.. కొరటా శివ ఇప్పటి వరకు తీసిన ఏ సినిమా కూడా పరాజయం కాకపోవడంతో సహజంగానే ఈ సినిమాపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమా కథ ఏమిటీ..? ఎవరెవరు నటించనున్నారు.. అనే విషయాలు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దీనికి సంబంధించి ఎన్టీఆర్ అభిమానులు ఇంటర్‌నెట్‌ను జల్లెడపడుతున్నారు. ఈ క్రమంలో రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో వీటన్నింటికి ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చాడు.

కొరటాలతో చేయనున్న సినిమా రివేంజ్ డ్రామా .. ఇది ఫిబ్రవరి నుంచి మొదలవుతుందని యంగ్‌టైగర్ చెప్పారు. ఆరు .. ఏడు నెలల్లో ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించినట్లు ఎన్టీఆర్ తెలిపారు. ఇక కేజీఎఫ్‌ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో కూడా ఎన్టీఆర్ ఒక ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపైనా ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రశాంత్ నీల్‌తో సినిమా అక్టోబర్లో సెట్స్ పైకి వెళుతుందని.. ఇది 'కేజీఎఫ్' తరహాలోనే భారీ యాక్షన్ సినిమా అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు

More News

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి రెడీ అవుతున్న ‘‘పుష్ప’’.. ఇక ప్రమోషన్స్‌లో దూకుడే..!!!

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప.

బిగ్‌బాస్ 5 తెలుగు: కాజల్‌కు కెప్టెన్సీ ఇక లేనట్లే.. అంతా శ్రీరామ్‌ వల్లే, బాత్‌రూమ్‌లో కన్నీళ్లు

రోజులు గడిచేకొద్ది బిగ్‌బాస్ తెలుగు 5వ సీజన్ మరింత ఉత్కంఠగా మారుతోంది.

రెజీనా క‌సాండ్ర ‘బ్రేకింగ్ న్యూస్’ షూటింగ్ ప్రారంభం

రెజీనా క‌సాండ్ర‌, సుబ్బ‌రాజు, జె.డి.చ‌క్ర‌వ‌ర్తి ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘బ్రేకింగ్ న్యూస్’ .

ఇలాంటి జానర్‌లో ఇదే నా బెస్ట్ వర్క్ అవుతుంది - ‘అఖండ’ ప్రమోషన్స్‌లో తమన్

నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ` డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

‘తగ్గేదే లే’ సినిమా నుండి దివ్యా పిళ్లై ఫస్ట్ లుక్ విడుదల

టాలీవుడ్‌లో భద్ర ప్రొడక్షన్స్ అతి పెద్ద నిర్మాణసంస్థగా అవతరించబోతోంది. విభిన్న చిత్రాలను భారీ బడ్జెట్‌లో నిర్మించేందుకు రెడీ అవుతోంది.