ఇద్ద‌రు బిడ్డ‌ల త‌ల్లిగా కాజ‌ల్‌?

  • IndiaGlitz, [Monday,January 01 2018]

కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. గ్లామ‌ర్ పాత్ర‌లకే ప‌రిమితం కాకుండా పెర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్ర‌ల్లోనూ ఆక‌ట్టుకున్న క‌థానాయిక పేరిది. ద‌క్షిణాదిన స్టార్ హీరోయిన్‌గా రాణించిన కాజ‌ల్‌.. హిందీలోనూ సినిమాలు చేసి మెప్పించింది. అయితే.. ప‌దేళ్ల కెరీర్‌ని పూర్తి చేసుకున్నా.. ఈ ముద్దుగుమ్మ ఇప్ప‌టివ‌ర‌కు బిడ్డ‌ల త‌ల్లిగా క‌నిపించిన సంద‌ర్భం లేద‌నే చెప్పాలి. త్వ‌ర‌లో ఆ ముచ్చ‌టా తీరేలా ఉంది. అన్ని అనుకున్న‌ట్లుగా కుదిరితే.. త‌న‌ని తెలుగు తెర‌కి ప‌రిచ‌యం చేసిన తేజ ద‌ర్శ‌క‌త్వంలో కాజ‌ల్ ఇలా బిడ్డ‌ల త‌ల్లిగా క‌నిపించే అవ‌కాశముంద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

కాస్త వివ‌రాల్లోకి వెళితే.. వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనున్న ఈ సినిమాలో వెంకీ.. మిడిల్ ఏజ్డ్ ప్రొఫెస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఇద్ద‌రు బిడ్డ‌ల తండ్రిగా క‌నిపించ‌నున్న ఆయ‌న పాత్ర‌కి జోడీగా కాజ‌ల్ న‌టించే అవ‌కాశ‌ముంద‌ని గ‌త కొంత కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఆటా నాదే వేటా నాదే పేరుతో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీత‌మందించ‌నున్నారు. కాగా, ఈ సినిమా కోసం కాజ‌ల్ కోటి రూపాయిల పారితోషికం డిమాండ్ చేస్తోంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే కాజ‌ల్ ఎంపిక‌పై క్లారిటీ వ‌స్తుంది.

More News

అక్క‌డా దేవిశ్రీ ప్ర‌సాద్‌నే హ‌వా

దేవిశ్రీ ప్ర‌సాద్‌.. తెలుగు ప‌రిశ్ర‌మ‌లో ఓ సంచ‌ల‌నం. ప్ర‌స్తుతం నెంబ‌ర్‌వ‌న్ క‌థానాయ‌కుడిగా దూసుకుపోతున్న ఈ యువ సంగీత సంచ‌ల‌నం.. తెలుగులో ఈ ఏడాది చెప్పుకోద‌గ్గ సంఖ్య‌లోనే సినిమాలు చేశాడు.

37 రోజులు.. 10 ఫస్ట్ లుక్స్

వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు యువ కథానాయకుడు నేచురల్ స్టార్ నాని.

'సుస్వాగతం' కి 20 ఏళ్లు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో.

ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో నూతన సంవత్సర వేడుకలు

ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

ట్రెండ్ క్రియేట్ చేస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌...

జ‌ల్సా, అత్తారింటికి దారేది సినిమాల త‌ర్వాత ప‌వ‌న్ క‌ల్యాణ్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న హ్యాట్రిక్ చిత్రం 'అజ్ఞాత‌వాసి'. ఈ సినిమా పై భారీ అంచ‌నాలున్నాయి. జ‌న‌వ‌రి 10న సినిమా విడుద‌ల‌వుతుంది.