close
Choose your channels

ట్రెండ్ క్రియేట్ చేస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌...

Monday, January 1, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జ‌ల్సా, అత్తారింటికి దారేది సినిమాల త‌ర్వాత ప‌వ‌న్ క‌ల్యాణ్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న హ్యాట్రిక్ చిత్రం 'అజ్ఞాత‌వాసి'. ఈ సినిమా పై భారీ అంచ‌నాలున్నాయి. జ‌న‌వ‌రి 10న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ పాట‌ను పాడారు. గ‌తంలో కూడా ప‌వ‌న్ త‌న చిత్రాల్లో పాట‌లు పాడిన సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు అలాగే 'కొడ‌కా కోటేశ్వ‌ర‌రావా!..' అంటూ ప‌వ‌న్ ఆల‌పించిన సాంగ్‌ను డిసెంబ‌ర్ 31న అభిమానుల‌కు కానుక‌గా..విడుద‌ల చేశారు. ఈ సాంగ్ విడుద‌లైన 16 గంట‌ల్లోనే 3 మిలియ‌న్ వ్యూస్‌తో పాటు 2.5 ల‌క్ష‌ల లైక్స్‌ను రాబ‌ట్టుకుని సినిమాపై ఉన్న క్రేజ్‌ను చెప్పింది.

ఈ సినిమాలో ప‌వ‌న్ స‌ర‌స‌న కీర్తి సురేష్‌, అను ఇమాన్యుయేల్ హీరోయిన్స్‌గా న‌టిస్తుంటే..ఖుష్బూ కీల‌క‌పాత్ర‌లో న‌టించింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.