కమల్ కొత్త ఆలోచన

  • IndiaGlitz, [Monday,June 26 2017]

యూనివ‌ర్స‌ల్ హీరోగా విలక్షణ పాత్రలతో మెప్పించే హీరో కమల్‌ ఇప్పుడు 'విశ్వరూపం 2' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నాడు. దీంతో పాటు బిగ్‌బాస్‌ తమిళ వెర్షన్‌కు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. గత కొంతకాలంగా కమల్‌హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ 'మరుదనాయగమ్‌' గురించి వార్తలు వినిపిస్తున్నాయి. ఓ ఇంటర్వ్యూలో దీని గురించి మీడియా ప్రశ్నిస్తే కమల్‌ అందరినీ ఆశ్చర్య పరిచే సమాధానమిచ్చాడు. 'ఏమో చెప్పలేం మరుదనాయగమ్‌ టీవీ సిరీస్‌ రూపంలో రావచ్చు లేదా వెబ్‌ సిరీస్‌ రూపంలో కూడా రావచ్చు.

ప్రస్తుతానికి ఇంకా చర్చల దశలోనే ఉన్నాం' అన్నారు. దీంతో ఇప్పుడు అందరూ అసలు కమల్‌ ఆలోచనేంటో అర్థంకావడం లేదనుకున్నారు. కానీ కమల్‌ హాసన్‌ విశ్వరూపం మొదటి పార్ట్‌ నుండి సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయడానికి సమస్య వచ్చినప్పుడు డిటిహెచ్‌లో విడుదల చేయడానికి రెడీ అయ్యారు. కానీ చివరకు డిస్ట్రిబ్యూటర్స్‌ సమస్యతో అప్పట్లో తన ఆలోచనను విరమించుకున్నారు. కానీ డిజిటల్‌ ట్రెండ్‌ ఊపందుకున్న ఈ సమయంలో కమల్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనని అనుకుంటున్నారందరూ.

More News

పుస్కూర్ రామ్మోహన్ కి దాసరి కిరణ్ కుమార్ అభినందనలు!

తెలంగాణ స్టేట్ ఫిల్మ్, టీవీ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎఫ్టీవీ అండ్ టీడీసీ) చైర్మన్గా ప్రముఖ నిర్మాత పుస్కూర్ రామ్మోహన్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

డైరెక్టర్ సుకుమార్ రిలీజ్ చేసిన 'జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్' ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్

నవీన్ చంద్ర-నివేదా థామస్ జంటగా నటిస్తున్న చిత్రం "జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్". కొత్తపల్లి అనురాధ సమర్పణలో అనురాగ్ ప్రొడక్షన్స్ పతాకంపై కొత్తపల్లి ఆర్.రఘుబాబు-కె.బి.చౌదరిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్ వోధిరాల దర్శకుడు.

ఆఖరి పాట చిత్రీకరణలో 'గౌతమ్ నంద' బృందం

మాస్ హీరో గోపీచంద్, హ్యాట్రిక్ డైరెక్టర్ సంపత్ నందిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సూపర్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ "గౌతమ్ నంద". శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలోని ఆఖరి పాట అయిన "బోలే రామ్ బోలే రామ్" పాట చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతోంది.

విజయ్ అదిరింది ఫస్ట్ లుక్ కు ట్రెమండస్ రెస్పాన్స్

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న 61వ ప్రతిష్టాత్మక చిత్రం అదిరింది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. అదిరింది అనే టైటిల్ విజయ్ కు సరిగ్గా సరిపోయిందనే కామెంట్స్ వస్తున్నాయి

జూలై 14న 'దండుపాళ్యం-2'

వెంకట్ మూవీస్ పతాకంపై శ్రీనివాసరాజు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత వెంకట్ నిర్మించిన 'దండుపాళ్య' కన్నడలో బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ మూవీగా 30 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.