close
Choose your channels

కమల్ కొత్త ఆలోచన

Monday, June 26, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యూనివ‌ర్స‌ల్ హీరోగా విలక్షణ పాత్రలతో మెప్పించే హీరో కమల్‌ ఇప్పుడు 'విశ్వరూపం 2' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నాడు. దీంతో పాటు బిగ్‌బాస్‌ తమిళ వెర్షన్‌కు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. గత కొంతకాలంగా కమల్‌హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ 'మరుదనాయగమ్‌' గురించి వార్తలు వినిపిస్తున్నాయి. ఓ ఇంటర్వ్యూలో దీని గురించి మీడియా ప్రశ్నిస్తే కమల్‌ అందరినీ ఆశ్చర్య పరిచే సమాధానమిచ్చాడు. 'ఏమో చెప్పలేం మరుదనాయగమ్‌ టీవీ సిరీస్‌ రూపంలో రావచ్చు లేదా వెబ్‌ సిరీస్‌ రూపంలో కూడా రావచ్చు.

ప్రస్తుతానికి ఇంకా చర్చల దశలోనే ఉన్నాం' అన్నారు. దీంతో ఇప్పుడు అందరూ అసలు కమల్‌ ఆలోచనేంటో అర్థంకావడం లేదనుకున్నారు. కానీ కమల్‌ హాసన్‌ విశ్వరూపం మొదటి పార్ట్‌ నుండి సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయడానికి సమస్య వచ్చినప్పుడు డిటిహెచ్‌లో విడుదల చేయడానికి రెడీ అయ్యారు. కానీ చివరకు డిస్ట్రిబ్యూటర్స్‌ సమస్యతో అప్పట్లో తన ఆలోచనను విరమించుకున్నారు. కానీ డిజిటల్‌ ట్రెండ్‌ ఊపందుకున్న ఈ సమయంలో కమల్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనని అనుకుంటున్నారందరూ.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.