'కాంచ‌న‌-3' సెన్సార్ పూర్తి. ఏప్రిల్ 19 న విడుద‌ల‌

  • IndiaGlitz, [Monday,April 08 2019]

ముని, కాంచ‌న‌, కాంచ‌న‌-2 తో హార్ర‌ర్ కామెడీ చిత్రాల్లో సౌత్ ఇండియాలోనే భారీ స‌క్స‌ెస్ తో పాటు ఒక ట్రెండ్ సృష్టించిన రాఘ‌వ లారెన్స్ హీరోగా, స్వీయ ద‌ర్శ‌కత్వం లో ముని సిరీస్ నుంచి వ‌స్తున్న హార్ర‌ర్ కామెడీ చిత్రం కాంచ‌న‌-3. రాఘ‌వ లారెన్స్ అందించిన హార్ర‌ర్ చిత్రాల‌న్నీ సౌత్ ఇండియా లో బ్లాక్‌బ‌స్ట‌ర్స్ గా బాక్సాఫీస్ ని షేక్ చేసిన‌వే. అన్నిటిని మించి ఈ కాంచ‌న‌-3 మాత్రం లారెన్స్ కి స్పెష‌ల్ చిత్రంగా నిలవనుంది.

ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యూ బై ఏ సర్టిఫికెట్ తో సెన్సార్ సభ్యుల ప్రశంసలు అందుకుంది. రాఘ‌వ లారెన్స్ ఏం చేసినా స్పెష‌ల్ గా, సెన్సేషన్ గా ఉంటుంది. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్ తో ఒక మాసివ్ వేవ్ ని తీసుకొచ్చింది.. అటు సినీ ప్రేక్షకులు నుండి ఇటు సామాన్య ప్రేక్షకుడు నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత బి.మ‌ధు విడుదల చేయనున్నారు. రాఘ‌వేంద్ర ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ లో రాఘ‌వ నిర్మాణం లో ఈ సినిమా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో ఏప్రిల్ 19న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుద‌ల చేయనున్నారు.

ఈ సంద‌ర్బంగా రాఘవ లారెన్స్ మాట్లాడుతూ.... కాంచన 3 చిత్రం నా కెరీర్ కే ప్రత్యేకమైంది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. కథ, కథనం, గ్రాఫిక్స్ ప్రేక్షకుల్ని అబ్బురపరిచేలా ఉంటాయి. గతంలో వచ్చిన కాంచన సిరీస్ చిత్రాలు ప్రేక్షకుల్ని బాగా ఎంటర్ టైన్ చేశాయి. ఇప్పుడు వాటికి మించిన కథా బలంతో వస్తున్నాం. ఈ సినిమా కోసం ఎన్నడూ లేని విధంగా దాదాపు 220 రోజుల పాటు వర్క్ చేశాం. ప్రతీ చిన్న విషయాన్ని చాలా కేర్ ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేశాం. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ కు అద్భుతమైన స్పందన లభించింది.

ఈ ట్రైలర్ తో అంచనాలు తారాస్థాయికి చేరాయి. తమన్ అద్భుతమైన రీ రికార్డింగ్ వర్క్ చేస్తున్నాడు. ఇందులో నా గెటప్ కు చాలా మంచి పేరొచ్చింది. నా లుక్ కోసం చాలా కేర్ తీసుకున్నాం. సెన్సార్ సభ్యులు మా చిత్రాన్ని మెచ్చుకున్నారు. యూ బై ఏ సర్టిఫికెట్ తో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో ఏప్రిల్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. తెలుగులో బి.మధు గారు విడుదల చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అని అన్నారు.

న‌టీన‌టులు.. రాఘ‌వ లారెన్స్‌, ఓవియా, వేదిక‌, కొవైస‌ర‌ళ‌, క‌భీర్ దుహ‌న్ సింగ్‌, శ్రీమ‌న్‌, దేవ‌ద‌ర్శిని, స‌త్య‌రాజ్‌, కిషోర్ త‌దిత‌రులు

More News

బాలయ్య కొట్టినా ఫ్యాన్స్ ఏమనుకోరు..!: వసుంధర

టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణ ఫ్యాన్స్‌పై ఏ రేంజ్‌లో చేయిసుకున్నారో మనందరం చూసిన సంగతి తెలిసిందే.

అలీ గురించి మాట్లాడుతూ పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. టాలీవుడ్ ప్రముఖ నటుడు అలీ మధ్య స్నేహం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.

'ఎవడు తక్కువకాదు' టీజర్, పాటకు అద్భుత స్పందన!

'పూర్ణక్క వస్తేనే లింగ వెళతాడు' - 'ఎవడు తక్కువ కాదు' సినిమా టీజర్ లో ఉన్నది ఒక్కటే డైలాగ్. అయితే... ఆ ఒక్కటీ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించింది. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'లో

'రుణం' ప్రీ రిలీజ్‌, ఆడియో సక్సెస్‌మీట్‌

బెస్ట్‌విన్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌ పై భీమినేని సురేష్‌, జి.రామకృష్ణారావుసంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం రుణం.

'చిత్రలహరి' సెన్సార్ పూర్తి

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న చిత్రం `చిత్రలహరి`.