ర‌ణ‌దీప్ హుడా కంగ‌నా సోద‌రి ఫైర్‌

  • IndiaGlitz, [Wednesday,April 17 2019]

2019లో ఉత్త‌మ నటి ఎవ‌రు? అనే స‌ర్వే నిర్వ‌హించింది. అందులో కంగ‌నా, ఆలియా భ‌ట్ మ‌ధ్య పోటీ నెల‌కొంద‌ని స‌ద‌రు ప‌త్రిక తెలియ‌జేసింది. అయితే కంగ‌నా, ఆలియా మ‌ధ్య మాట‌ల యుద్ధం అక్క‌డి నుండే మొద‌లైంది. 'ఆలియా ఓ సాధార‌ణ న‌టి.. ఆమెతో న‌న్ను పోల్చ‌డం ఇబ్బందిగా ఉంది' అంటూ కామెంట్ చేసింది. అప్ప‌టి నుండి ఇద్ద‌రి మ‌ధ్య ఏదో ఒక సంద‌ర్భంలో మాట‌ల యుద్ధం జ‌రుగుతూనే ఉంది. ఈ యుద్ధం ఇప్ప‌ట్లో ఆగేలా క‌న‌ప‌డ‌టం లేదు. ఇప్పుడు ఈ యుద్ధంలోకి ర‌ణ‌దీప్ హుడా కూడా చేరాడు.

ఆలియా భ‌ట్‌ను పొగుడుతూ ర‌ణ‌దీప్ హుడా ఓ ట్వీట్ చేశాడు. ''ప్రియ‌మైన ఆలియా నీపై విమ‌ర్శ‌లు చేసే వారిని పట్టించుకోకుండా, నీ ప‌ని నువ్వు చేసుకుంటూ ముందుకు పోతున్నావ్‌. నిన్ను నువ్వు నిరూపించుకుంటున్నందుకు చాలా గ‌ర్వ‌ప‌డుతున్నాను'' అంటూ ర‌ణ‌దీప్ పేర్కొన్నాడు. ఎక్క‌డా కంగనా పేరుని ప్ర‌స్తావించ‌లేదు. అయితే ర‌ణ‌దీప్ ట్వీట్ చేసిన కొద్దిసేప‌టికే కంగ‌నా సోద‌రి రంగోలి ర‌ణ‌దీప్ హుడాను విమ‌ర్శిస్తూ ట్వీట్స్ చేస్తూ వ‌చ్చారు.

''నువ్వు క‌ర‌ణ్ జోహార్‌కు అభిమానివి. అందుకే బంధు ప్రీతిని ప్రోత్స‌హిస్తూ ఆలియాను పొగుడుతున్నావు. ఆలియాలాంటి వాళ్లు క‌నీసం చెంచాగిరి చేసైనా విజ‌యం సాధిస్తున్నారు. నువ్వింకా ఫెయిల్యూర్ యాక్ట‌ర్‌వే. ఉంగ్లీ సినిమా స‌మ‌యంలో నువ్వు కంగ‌నాని ఎంత ఇబ్బంది పెట్టావో నాకు తెలుసు'' అంటూ రంగోలి తెలిపారు. మ‌రి దీనిపై ఆలియా భ‌ట్ ఎలా స్పందిస్తారో చూడాలి.

More News

బ‌న్ని.. మ‌రో కొత్త టైటిల్‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ ఈ నెల 24 నుండి షూటింగ్ జ‌రుపుకోనుంది. ఈ సినిమా టైటిల్ విష‌యంలో 'పార్థు'

హీరోయిన్ విష‌యంలో డైరెక్ట‌ర్ క్లారిటీ..

నితిన్ హీరోగా వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో `భీష్మ‌` అనే సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే.

జూన్ 7న విడుద‌ల‌ 'హిప్పి'

'ఆర్‌ఎక్స్‌100' ఫేమ్‌ కార్తికేయ, దిగంగన సూర్యవన్షీ జంట‌గా కలైపులి ఎస్‌. థాను సమర్పణలో వి. క్రియేషన్స్‌ పతాకంపై టిఎన్‌ కృష్ణ దర్శకత్వంలో

ఏపీని టీడీపీ స్వీప్‌ చేస్తుంది.. సీసీ ఫుటేజీ బయటికి తీయండి!

"ఆంధ్రప్రదేశ్ బాగుండాలి.. మనం బాగుండాలనుకునే ఏ ఒక్కరూ వైసీపీకి ఓటేయరు. ఏపీని టీడీపీ స్వీప్‌ చేస్తుంది"

ఏపీలో ఐదు చోట్ల రీ-పోలింగ్...

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా ఏప్రిల్-11న సార్వత్రిక ఎన్నికలు జరిగిన విషయం విదితమే. అయితే కొన్ని చోట్ల అవాంఛనీయ సంఘటనలు జరగడం..