బ్రేకింగ్: తీవ్ర విషాదం.. తుదిశ్వాస విడిచిన కత్తి మహేష్

  • IndiaGlitz, [Saturday,July 10 2021]

తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రముఖ ఫిలిం క్రిటిక్, నటుడు కత్తి మహేష్ మృతి చెందారు. ఇప్పుడే అందిన ఈ విషాదకర వార్తతో చిత్ర పరిశ్రమ, కత్తి మహేష్ అభిమానులు, సన్నిహితులు శోకసంద్రంలో మునిగిపోయారు.

చెన్నై అపోలో ఆసుపత్రిలో కత్తి మహేష్ చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన కత్తి మహేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారనే ఇప్పటి వరకు వార్తలు వచ్చాయి. ఆయనకు ఇక ఎలాంటి ప్రమాదం లేదని కూడా వార్తలు వినిపించాయి. కానీ ఇది ఊహించని పరిణామం.

గత నెల జూన్ 26న కత్తి మహేష్ కారులో ప్రయాణిస్తూ నెల్లూరు సమీపంలో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. దీనితో అతడిని వెంటనే నెల్లూరులోని మెడికేర్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలించారు. కొన్ని వారాలుగా మహేష్ అక్కడే చికిత్స పొందుతున్నారు.

తలకు, కంటికి బలమైన గాయాలు కావడంతో వైద్యులు కత్తి మహేష్ కు కీలకమైన సర్జరీలు నిర్వహించారు. కత్తి మహేష్ అవుట్ ఆఫ్ డేంజర్ అని, కొన్ని రోజుల పాటు విశ్రాంతి అవసరం అని వార్తలు వచ్చాయి. దీనితో ఆయన సన్నిహితులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ సడెన్ గా మహేష్ మృతి చెందడం అత్యంత విషాదంగా మారింది.

ఫిలిం క్రిటిక్ గా, రాజకీయ విశ్లేషకుడిగా కత్తి మహేష్ గుర్తింపు పొందారు. కత్తి మహేష్ చివరంగా క్రాక్ అనే చిత్రంలో కూడా నటించారు. టివి చర్చా కార్యక్రమాలు కూడా కత్తి మహేష్ కు గుర్తింపు తెచ్చిపెట్టాయి.

More News

మోహన్ బాబుపై వ్యక్తిగత దూషణలు, బూతులతో.. పోలీసులకు ఫిర్యాదు

సీనియర్ నటుడు మోహన్ బాబు సైబర్ క్రైమ్ పోలీసులని ఆశ్రయించారు.

ఒక వ్యక్తిని ప్రేమించా.. బ్రేకప్ జరిగింది: అనుపమ పరమేశ్వరన్

యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తన రియల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాన్ని రివీల్ చేసింది.

పిడి గుద్దుల్లాంటి పంచ్ లు.. వరుణ్ తేజ్ భీకరమైన బాక్సింగ్ పోరాటం!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న హై యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా 'గని' చివరి షెడ్యూల్ కి చేరుకుంది.

ప్రభాస్ మెమొరబుల్ పోస్ట్.. ఇండియన్ సినిమా సరికొత్త అధ్యాయానికి 6 ఏళ్ళు!

బాహుబలి.. ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పుడు ఎన్నో అనుమానాలు, సవాళ్లు. ఒక ప్రాంతీయ భాషా చిత్రం ఇంత బడ్జెట్ లో తెరకెక్కించడం రిస్క్ కదా అని పెదవి విరిచినవారు లేకపోలేదు.

మోస్ట్ డేంజరస్ వుమెన్ అంటూ మెహ్రీన్ కామెంట్స్.. వైరల్!

అందాల తార మెహ్రీన్ కౌర్ ఇటీవల తన వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మెహ్రీన్ రాణిస్తోంది.