ఇక్కడ ప్లాప్ మరి అక్కడ?

  • IndiaGlitz, [Wednesday,October 09 2019]

కొన్ని సినిమా వార్తలు ఆశ్చర్యకంగానూ, థ్రిల్లింగా అనిపిస్తాయి. అలాంటి వార్తొకటి ఇప్పుడు కోలీవుడ్‌లో వినపడుతుంది. అదేంటంటే తెలుగులో ప్లాప్ అయిన ఓ సినిమాను తమిళంలో రీమేక్ చేయబోతున్నారట. పోనీ అదేమన్నా స్టార్ హీరో సినిమానా? అంటే అదీ కాదు.. కుర్ర హీరో సినిమా. దీన్ని తమిళంలో రీమేక్ చేసే ప్లాన్స్ జరుగుతున్నాయట. ఇంతకు ఆ సినిమా ఏదో కాదు.. 'కవచం'. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా కాజల్ అగర్వాల్, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వం వహించారు. గత ఏడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ కాప్ డ్రామా ప్రేక్షకాదరణను పొందలేకపోయింది. అయితే ఇప్పుడు ఆ సినిమాను తమిళంలో విష్ణు విశాల్ రీమేక్ చేయాలనుకుంటున్నారనేది సమాచారం.

ఆసక్తికరమైన విషయమేమంటే.. రీసెంట్‌గా ‘రాక్షసుడు’ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ సక్సెస్‌ను దక్కించుకున్నాడు. ఈ సినిమాకు తమిళ చిత్రం ‘రాక్షసన్’కు రీమేక్. ఈ తమిళ చిత్రంలో విష్ణు విశాల్ హీరోగా నటించాడు. కాగా.. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ‘కవచం’ చిత్రాన్ని విష్ణు విశాల్ రీమేక్ చేయబోతున్నారు. కానీ ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమేమంటే.. ‘కవచం’ ప్లాప్ అయినా దాన్ని రీమేక్ చేయాలనుకోవడమే. అయితే కాన్సెప్ట్ నచ్చి ఉండొచ్చు. దాని ట్రీట్‌మెంట్‌ని వారి నెటివిటీకి తగినట్లు మార్చి తెరకెక్కిస్తే సినిమా విజయం సాధించే అవకాశాలున్నాయి. ‘కవచం’ ఓ కాప్ డ్రామా.. ఓ హత్య కేసులో అనుకోకుండా పోలీస్ ఆఫీసర్ చిక్కుకుపోతాడు. దాన్నుండి అతనెలా భయటపడతాడనేదే కథ. మరిక్కడ రాణించాలేని ఆ సినిమా అక్కడైనా విజయం సాధించాలని కోరుకుందాం.

More News

వి.వి.వినాయ‌క్ హీరోగా ప్రారంభ‌మైన `సీన‌య్య‌`

సెన్సేషనల్ డైరెక్టర్ వి వి వినాయక్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం `సీన‌య్య‌`. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై న‌ర‌సింహ ద‌ర్శ‌క‌త్వంలో

అక్టోబర్ 19న డిస్కో రాజా మొదటి పాట

మాస్ మహారాజ్ రవి తేజ మరోసారి తన పవర్ఫుల్ పెరఫార్మన్సుతో ఫాన్స్ ని

చిరంజీవి, కొర‌టాల శివ చిత్రం ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై రామ్‌చ‌ర‌ణ్‌, నిరంజ‌న్ రెడ్డి

ఎన్టీఆర్ ఎంట్రీ అలా.. రామ్ చ‌ర‌ణ్ ఎంట్రీ ఇలా..

యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మాసివ్ మ‌ల్టీస్టార‌ర్ `ఆర్ ఆర్ ఆర్‌`. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న

నితిన్, కీర్తి సురేష్ ల 'రంగ్ దే' ప్రారంభం

యువ కథానాయకుడు 'నితిన్', మహానటి 'కీర్తి సురేష్' ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్ టైన్మెంట్స్' నిర్మిస్తున్న చిత్రం 'రంగ్ దే' నేడు విజయదశమి పర్వదినాన ప్రారంభమయింది.