close
Choose your channels

ఇక్కడ ప్లాప్ మరి అక్కడ?

Wednesday, October 9, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇక్కడ ప్లాప్ మరి అక్కడ?

కొన్ని సినిమా వార్తలు ఆశ్చర్యకంగానూ, థ్రిల్లింగా అనిపిస్తాయి. అలాంటి వార్తొకటి ఇప్పుడు కోలీవుడ్‌లో వినపడుతుంది. అదేంటంటే తెలుగులో ప్లాప్ అయిన ఓ సినిమాను తమిళంలో రీమేక్ చేయబోతున్నారట. పోనీ అదేమన్నా స్టార్ హీరో సినిమానా? అంటే అదీ కాదు.. కుర్ర హీరో సినిమా. దీన్ని తమిళంలో రీమేక్ చేసే ప్లాన్స్ జరుగుతున్నాయట. ఇంతకు ఆ సినిమా ఏదో కాదు.. `కవచం`. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా కాజల్ అగర్వాల్, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వం వహించారు. గత ఏడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ కాప్ డ్రామా ప్రేక్షకాదరణను పొందలేకపోయింది. అయితే ఇప్పుడు ఆ సినిమాను తమిళంలో విష్ణు విశాల్ రీమేక్ చేయాలనుకుంటున్నారనేది సమాచారం.

ఆసక్తికరమైన విషయమేమంటే.. రీసెంట్‌గా ‘రాక్షసుడు’ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ సక్సెస్‌ను దక్కించుకున్నాడు. ఈ సినిమాకు తమిళ చిత్రం ‘రాక్షసన్’కు రీమేక్. ఈ తమిళ చిత్రంలో విష్ణు విశాల్ హీరోగా నటించాడు. కాగా.. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ‘కవచం’ చిత్రాన్ని విష్ణు విశాల్ రీమేక్ చేయబోతున్నారు. కానీ ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమేమంటే.. ‘కవచం’ ప్లాప్ అయినా దాన్ని రీమేక్ చేయాలనుకోవడమే. అయితే కాన్సెప్ట్ నచ్చి ఉండొచ్చు. దాని ట్రీట్‌మెంట్‌ని వారి నెటివిటీకి తగినట్లు మార్చి తెరకెక్కిస్తే సినిమా విజయం సాధించే అవకాశాలున్నాయి. ‘కవచం’ ఓ కాప్ డ్రామా.. ఓ హత్య కేసులో అనుకోకుండా పోలీస్ ఆఫీసర్ చిక్కుకుపోతాడు. దాన్నుండి అతనెలా భయటపడతాడనేదే కథ. మరిక్కడ రాణించాలేని ఆ సినిమా అక్కడైనా విజయం సాధించాలని కోరుకుందాం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.