KCR:మరో ఉద్యమం తప్పదు.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేసీఆర్ కౌంటర్..

  • IndiaGlitz, [Tuesday,February 06 2024]

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తుంటి ఎముక సర్జరీతో కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న మాజీ సీఎం కేసీఆర్ తాజాగా ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమయ్యారు. కేంద్రానికి రాష్ట్ర ప్రాజెక్టుల అప్పగింత, కృష్ణా గోదావరి జలాల కేటాయింపుల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాజాగా తెలంగాణ భవన్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రజాప్రతినిధులతో సమావేశమైన కేసీఆర్.. రేవంత్ వ్యాఖ్యలపై స్పందించారు.

సీఎం రేవంత్‌రెడ్డికి ప్రాజెక్టులపై ఎలాంటి అవగాహన లేదని అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగిస్తే జరిగే నష్టం కూడా వాళ్లకు తెలియదన్నారు. ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం వస్తే రాష్ట్రం ప్రతి చిన్న విషయానికి ఆధారపడాల్సి వస్తుందని పేర్కొన్నారు. మన ప్రభుత్వంలో ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోలేదని స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేక ప్రాజెక్టులను అప్పగించడానికి ఒప్పుకున్నారని మండిపడ్డారు. ఎంతో మంది హేమాహేమీలను చూశామని బీఆర్ఎస్‌ను టచ్ చేయటం ఎవరి తరం కాదన్నారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంత వరకైనా వెళ్లేందుకు సిద్ధమని పేర్కొన్నారు. కేఆర్‌ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులు వెళ్తే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని.. చివరికి డ్యాంకు సున్నం వేయాలన్నా బోర్డు పర్మిషన్ తీసుకోవాల్సిన దుస్థితి వస్తుందన్నారు. కాంగ్రెస్‌ సర్కారుకు తెలివి లేదని ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం రైతుల సాగునీటి హక్కులకు గొడ్డలిపెట్టు లాంటిదని చెప్పుకొచ్చారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నల్గొండ జిల్లాలో ఈనెల 13న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని స్పష్టంచేశారు.

ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా సభను ఏర్పాటు చేసి తీరుతామని వెల్లడించారు. ప్రజా క్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని... మరో ప్రజా ఉద్యమంతో తెలంగాణ ప్రజల హక్కులు కాపాడుతామని కేసీఆర్ వెల్లడించారు. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య నువ్వానేనా అనే రీతిలో పోరాటం జరగనుంది.

More News

OG: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'ఓజీ' రిలీజ్ డేట్ అనౌన్స్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ అభిమానులకు శుభవార్త అందించింది డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్.

Mudragada:టీడీపీ మాజీ ఎంపీతో ముద్రగడ భేటీ.. పొత్తుకు మద్దతు..

ఏపీలో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఎత్తులు పైఎత్తులతో  పార్టీలు ముందుకెళ్తున్నాయి.

KCR:తెలంగాణ భవన్‌కు వచ్చిన కేసీఆర్.. ఘనస్వాగతం పలికిన శ్రేణులు..

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు వచ్చారు. దాదాపు 3 నెలల విరామం తర్వాత ఆయన తెలంగాణ భవన్‌కు

Bharat Rice:రూ.29లకే 'భారత్ రైస్' విక్రయాలు ప్రారంభం.. ఎక్కడ కొనుగోలు చేయాలంటే..?

దేశవ్యాప్తంగా బియ్యం ధరలు పెరిగిన వేళ తక్కువ ధరలకే బియ్యం అందించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Hanuman:'హనుమాన్' మరో రికార్డ్.. 25 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే..?

సంక్రాంతి పండుగ కానుకగా చిన్న సినిమాగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'హనుమాన్' చిత్రం రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది.