మహానటిలా నేను చేయలేనని అన్నా - కీర్తి

  • IndiaGlitz, [Tuesday,January 09 2018]

మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా మహానటి' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకుడు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి గట్టిగా పది సినిమాలు కూడా చేయని నటితో.. ఏకంగా మహానటి' సినిమానే తెరకెక్కిస్తున్నారంటే సాహసమనే అనుకున్నారు అంతా. కాని ప్రధాన పాత్ర పోషిస్తున్న కీర్తి సురేష్ ఈ సినిమాని ఒక బాధ్యతగా చేస్తున్నానని, ఒక పక్క సంతోషంగా ఉన్నా భయం కూడా ఉందని చెప్తూ వచ్చారు.

ఈ చిత్రంలో తన పాత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలని కీర్తి ఓ మీడియాతో పంచుకున్నారు. “నాగ్‌ అశ్విన్ నాకు కథను చెప్పినప్పుడు నేను సావిత్రి గారి పాత్రను చేయలేనని చెప్పాను. కాని ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత, నాలో కొంచెం నమ్మకం వచ్చింది. నేను ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు చాలా బాధపడ్డాను.

ఆమెకు సంబంధించిన సన్నివేశాల్లో నటించినందుకే ఇంత బాధ పడ్డానంటే....ఈ పరిస్థితుల్ని నిజ జీవితంలో అనుభవించిన సావిత్రి గారు ఇంకెంత బాధపడుంటారో ఒక్కసారి ఊహించుకోండి” అని తెలిపారు. అలాగే సావిత్రి నిజ జీవితంలో తాగుడుకు బానిసై ఎన్నో ఎదురుదెబ్బలు తగిలినప్పటి సన్నివేశాల్లో నటించలేక అభ్యంతరం తెలియచేసానని...నాగ అశ్విన్ గారి ప్రోత్సాహంతో నటించానని చెప్పుకొచ్చారు. ఇకపై నాయికా ప్రాముఖ్యత ఉన్న పాత్రలే చేస్తారా...అని అడిగిన ప్రశ్నకు “నాయికా ప్రాముఖ్యత ఉన్న సినిమాలతో పాటు కమర్షియల్ సినిమాలు కూడా చేస్తాన”ని ముక్తాయించారు.

More News

నిఖిల్ కి జోడీగా కేథరిన్

విభిన్న పాత్రలను చేయడానికి ముందుండే కథానాయకులలో

కన్ ఫర్మ్ చేసిన బోయపాటి

నటసింహ బాలకృష్ణ,సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో

అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌ పై 'రంగుల‌రాట్నం' చేయ‌డం చాలా సంతోషంగా ఉంది - శ్రీరంజ‌ని, చిత్రా శుక్లా

అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌ నిర్మాణంలో రూపొందిన చిత్రం 'రంగులరాట్నం'. రాజ్‌తరుణ్‌, చిత్రా శుక్లా హీరో హీరోయిన్స్‌. శ్రీరంజని దర్శకురాలు. ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతుంది.

సెన్సార్ పూర్తి చేసుకొన్న 'ఇగో'

'ఆకతాయి' ఫేమ్‌ ఆశిష్‌ రాజ్, సిమ్రాన్‌ జంటగా రూపొందుతోన్న సినిమా "ఇగో". సుబ్రమణ్యం దర్శకత్వంలో విజయ్‌ కరణ్‌–కౌసల్‌ కరణ్‌–అనిల్‌ కరణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీతం సమకూర్చారు.

శివాని సినిమా కన్ ఫర్మ్..

జీవితా రాజశేఖర్ తనయ శివాని తెరంగేట్రానికి రంగం సిద్ధమైంది.