close
Choose your channels

మహానటిలా నేను చేయలేనని అన్నా - కీర్తి

Tuesday, January 9, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా మహానటి` సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకుడు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి గట్టిగా పది సినిమాలు కూడా చేయని నటితో.. ఏకంగా మహానటి` సినిమానే తెరకెక్కిస్తున్నారంటే సాహసమనే అనుకున్నారు అంతా. కాని ప్రధాన పాత్ర పోషిస్తున్న కీర్తి సురేష్ ఈ సినిమాని ఒక బాధ్యతగా చేస్తున్నానని, ఒక పక్క సంతోషంగా ఉన్నా భయం కూడా ఉందని చెప్తూ వచ్చారు.

ఈ చిత్రంలో తన పాత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలని కీర్తి ఓ మీడియాతో పంచుకున్నారు. “నాగ్‌ అశ్విన్ నాకు కథను చెప్పినప్పుడు నేను సావిత్రి గారి పాత్రను చేయలేనని చెప్పాను. కాని ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత, నాలో కొంచెం నమ్మకం వచ్చింది. నేను ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు చాలా బాధపడ్డాను.

ఆమెకు సంబంధించిన సన్నివేశాల్లో నటించినందుకే ఇంత బాధ పడ్డానంటే....ఈ పరిస్థితుల్ని నిజ జీవితంలో అనుభవించిన సావిత్రి గారు ఇంకెంత బాధపడుంటారో ఒక్కసారి ఊహించుకోండి” అని తెలిపారు. అలాగే సావిత్రి నిజ జీవితంలో తాగుడుకు బానిసై ఎన్నో ఎదురుదెబ్బలు తగిలినప్పటి సన్నివేశాల్లో నటించలేక అభ్యంతరం తెలియచేసానని...నాగ అశ్విన్ గారి ప్రోత్సాహంతో నటించానని చెప్పుకొచ్చారు. ఇకపై నాయికా ప్రాముఖ్యత ఉన్న పాత్రలే చేస్తారా...అని అడిగిన ప్రశ్నకు “నాయికా ప్రాముఖ్యత ఉన్న సినిమాలతో పాటు కమర్షియల్ సినిమాలు కూడా చేస్తాన”ని ముక్తాయించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.