'కేటుగాడు' ఆడియో రిలీజ్ డేట్...

  • IndiaGlitz, [Tuesday,July 21 2015]

ఉలవచారు బిర్యాని' ద్వారా హీరోగా పరిచయమైన తేజస్‌ నటిస్తున్న తాజా చిత్రం 'కేటుగాడు'. నూతన దర్శకుడు కిట్టు నల్లూరి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో చాందినీ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ రచయిత వీఎస్‌పీ తెన్నేటి సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని '100 క్రోర్స్ అకాడమీ'తో కలిసి వెంకటేష్ మూవీస్ పతాకంపై యువ వ్యాపారవేత్త వెంకటేష్ బలసాని నిర్మించారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదలను జూలై 25న హైదరాబాద్ లోని తాజ్ దక్కన్ లో నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా..

నిర్మాత వెంకటేష్ బలసాని మాట్లాడుతూ 'వైవిధ్యమైన కథాంశంతో అన్ని వర్గాల ప్రేక్షకుల ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుంది. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా, క్వాలిటీ లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని రూపొందించాం. సాయికార్తీక్ మంచి మ్యూజిక్ అందించారు. ఆడియో కార్యక్రమాన్ని జూలై 25న నిర్వహిస్తున్నాం. తేజస్ ఈ చిత్రంలో చాలా డిఫరెంట్ లుక్ తో కనపడతాడు. ఆగస్ట్ లో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం'' అన్నారు.

More News

త్రిషకి హీరో దొరికాడు..

మూడు పదుల వయసు దాటినప్పటికీ తమిళ సుందరాంగి త్రిషకి ఆఫర్ల వెల్లువ మాత్రం తగ్గడం లేదు.

'శ్రీమంతుడు' సెన్సార్ డేట్..

సూపర్స్టార్ మహేష్ హీరోగా మిర్చి ఫేమ్ కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీమేకర్స్, ఎం.బి. ఎంటర్టైన్మెంట్ ప్రై.లి.

'బాహుబలి'కి మ్యూజిక్ లెజెండ్ ప్రశంస..

విజువల్ వండర్ గా, టాలీవుడ్ ప్రెస్టిజియస్ మూవీగా విడుదలైన ‘బాహుబలి’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీని క్రియేట్ చేస్తుంది. దేశం రాజకీయ, సినీ ప్రముఖుల నుండి ప్రశంసలు సైతం అందుకుంటుంది.

'చంద్రిక'లోని పాటలన్నీ చెవులకింపుగా ఉంటాయి - కామ్న జెఠ్మలాని

సంచలన విజయం సాధించిన ‘చంద్రముఖి’ తరహాలో రూపొందుతున్న హర్రర్ డ్రామా ఎంటర్టైనర్ ‘చంద్రిక’.

'రుద్రమదేవి' రిలీజ్ డేట్

అనుష్క టైటిల్ పాత్రలో గుణా టీమ్ వర్క్స్ బ్యానర్పై గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రుద్రమదేవి’.