close
Choose your channels

'చంద్రిక'లోని పాటలన్నీ చెవులకింపుగా ఉంటాయి - కామ్న జెఠ్మలాని

Tuesday, July 21, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సంచలన విజయం సాధించిన చంద్రముఖి` తరహాలో రూపొందుతున్న హర్రర్‌ డ్రామా ఎంటర్‌టైనర్‌ చంద్రిక`. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఫ్లయింగ్‌ వీల్స్‌ ప్రొడక్షన్స్‌` పతాకంపై శ్రీమతి వి.ఆశ నిర్మిస్తున్నారు. కార్తీక్‌ జయరామ్‌, కామ్నజెఠ్మలాని, శ్రీముఖి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా యోగేష్‌ మునిసిద్దప్ప దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గున్వంత్‌సేన్‌ సంగీత సారధ్యం వహిస్తున్న ఈ చిత్రం ఆడియో బ్లాక్‌బస్టర్‌ మ్యూజిక్‌ ద్వారా విడుదలైంది.

వనమాలి, కరుణాకర్‌ అడిగర్ల సాహిత్యం సమకూర్చగా.. సునీత, ఎం.ఎం.శ్రీలేఖ, మాళవిక, కార్తీక్‌ గాత్రమందించారు. ఓ భవనంలో జరిగే అనూహ్య సంఘటన వల్ల ఓ కొత్త జంట ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారని దాని సమాహారంగా, సరికొత్త స్క్రీన్‌ప్లేతో తెరకెక్కుతున్న చంద్రిక` పోస్ట్‌ ప్రొడక్షన్‌ పను కూడా దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఆడియో విడుదల సందర్భంగా ....

చిత్ర కథానాయకుడు కార్తీక్‌ జయరాం మాట్లాడుతూ `రజనీసార్‌ చంద్రముఖి` చిత్రానికి విద్యాసాగర్‌ సంగీతం ఎంత ప్లస్సయ్యిందో.. చంద్రిక` చిత్రానికి మా గున్వంత్‌సేన్‌ సంగీతం కూడా అంతే ప్లస్సవుతుంది. గిరీష్‌ కర్నాడ్‌, ఎల్‌.బి.శ్రీరాం వంటి సీనియర్‌ ఆర్టిస్టులతోనూ.. తాగుబోతు రమేష్‌, సత్యం రాజేష్‌ వంటి టాలెంటెడ్‌ ఆర్టిస్టుతోనూ ఈ సినిమాలో నటించడం చాలా సంతోషాన్నిచ్చింది. ఇంత గొప్ప సినిమాలో భాగమైనందుకు చాలా గర్వంగా ఉంది` అన్నారు.

చిత్ర కథానాయకి కామ్న జఠ్మలాని మాట్లాడుతూ... నా కెరీర్‌లో ఇప్పటివరకు నేను చేసిన అన్ని సినిమాల్లోకి ది బెస్ట్‌`గా నిలిచే సినిమా చంద్రిక`. ఈ చిత్రంలో శ్రీముఖి పాత్ర కూడా చాలా బాగుంటుంది. అలాగే హీరో కార్తీక్‌ జయరాం కూడా చాలా బాగా పెర్‌ఫార్మ్‌ చేసాడు. చంద్రిక`లోని పాటలన్నీ చెవులకింపుగా ఉంటాయి` అన్నారు.

చిత్ర దర్శకుడు యోగేష్‌ మునిసిద్దప్ప మాట్లాడుతూ.. సాజిద్‌ ఖురేషి సమకూర్చిన కథ`స్క్రీన్‌ప్లే, గున్వంత్‌సేన్‌ మ్యూజిక్‌ చంద్రిక` చిత్రానికి ఆయువుపట్టుగా నిుస్తాయి. చంద్రముఖి`లా చిరకాలం గుర్తుండిపోయేంత గొప్పగా.. గ్రాఫిక్స్ కు పెద్ద పీట వేస్తూ రూపొందుతున్న చంద్రిక` చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతుండడం నా అదృష్టంగా భావిస్తున్నాను` అన్నారు.

గిరీష్‌ కర్నాడ్‌, ఎల్‌.బి.శ్రీరాం, తాగుబోతు రమేష్‌, సత్యం రాజేష్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కె.రాజేంద్రబాబు, సాహిత్యం: వనమాలి, కరుణాకర్‌ అడిగర్ల, సంగీతం: గున్వంత్‌సేన్‌, కథ- స్క్రీన్‌ప్లే: సాజిద్‌ ఖురేషి, నిర్మాత: శ్రీమతి వి.ఆశ, దర్శకత్వం: యోగేష్‌ మునిసిద్దప్ప.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.