కిల్లింగ్ వీరప్పన్ కి బంపర్ ఆఫర్..

  • IndiaGlitz, [Thursday,January 21 2016]
సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన తాజా చిత్రం కి్లింగ్ వీర‌ప్ప‌న్. గంథ‌పు చెక్క‌ల‌ స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ జీవిత క‌థ‌ను అంద‌ర్నీ ఆక‌ట్టుకునేలా తెర‌కెక్కించ‌డంతో కిల్లింగ్ వీర‌ప్ప‌న్ స‌క్సెస్ ను సొంతం చేసుకుంది. చాలా గ్యాప్ త‌రువాత వ‌ర్మ సినిమా స‌క్సెస్ అయ్యింది. క‌న్న‌డ‌లో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ భాష‌ల్లో డ‌బ్ చేసారు. అయితే కిల్లింగ్ వీర‌ప్ప‌న్ బాక్స్ ఫీస్ వ‌ద్ద స‌క్సెస్ సాధించ‌డంతో స‌న్ నెట్ వ‌ర్క్ తెలుగు,త‌మిళ‌, క‌న్న‌డ శాటిలైట్ రైట్స్ కోసం 6 కోట్లు ఆఫ‌ర్ చేసింద‌ట‌. ఈ మ‌ధ్య కాలంలో రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన ఏ సినిమాకి ఇంత రేటు ఆఫ‌ర్ చేయ‌లేదు. ఈ సినిమా స‌క్సెస్ అవ్వ‌డంతో ఇప్పుడు హాలీవుడ్ కి ఈ సినిమాని తీసుకెళ్లాల‌నుకుంటున్నాడు వ‌ర్మ‌. మ‌రి..హాలీవుడ్ లో కిల్లింగ్ వీర‌ప్ప‌న్ ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

More News

స‌రైనోడు ఫ‌స్ట్ లుక్ డేట్ ఫిక్స్

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న తాజా చిత్రం స‌రైనోడు. ఈ చిత్రాన్ని బోయ‌పాటి శ్రీను తెర‌కెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నారు.

అందుకే బాల‌య్య‌తో అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా డిక్టేట‌ర్ తీసాను - డైరెక్ట‌ర్ శ్రీవాస్

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ హీరోగా న‌టించిన తాజా చిత్రం డిక్టేట‌ర్ ఈ చిత్రాన్ని డైరెక్ట‌ర్  శ్రీవాస్ తెర‌కెక్కించారు.

'డిక్టేటర్' సక్సెస్ టూర్

నందమూరి బాలకృష్ణ హీరోగా ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన చిత్రం ‘డిక్టేటర్’.

నితిన్ సినిమా పోస్ట్ పోన్ అవుతుందా?

నితిన్, సమంత హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘అ..ఆ...’. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

నమిత కొత్త పాత్ర...

ఇప్పటి వరకు ఏ హీరోయిన్ చేయని పాత్రలో హీరోయిన్ నమిత కనపడనుంది.తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నమిత తదనంతరం తమిళ తంబీలకు బాగా దగ్గరైంది.