close
Choose your channels

అందుకే బాల‌య్య‌తో అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా డిక్టేట‌ర్ తీసాను - డైరెక్ట‌ర్ శ్రీవాస్

Thursday, January 21, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ హీరోగా న‌టించిన తాజా చిత్రం డిక్టేట‌ర్ ఈ చిత్రాన్ని డైరెక్ట‌ర్ శ్రీవాస్ తెర‌కెక్కించారు. ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ తో క‌ల‌సి డైరెక్ట‌ర్ శ్రీవాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుక‌గా రిలీజైన డిక్టేట‌ర్ విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. ఈ సంద‌ర్భంగా డిక్టేట‌ర్ డైరెక్ట‌ర్ శ్రీవాస్ తో ఇంట‌ర్ వ్యూ మీకోసం..

డిక్టేట‌ర్ మూవీ గురించి మీకు వ‌చ్చిన ఫీడ్ బ్యాక్ ఏమిటి..?

సంక్రాంతికి ప‌ర్ ఫెక్ట్ మూవీ డిక్టేట‌ర్. సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అవ‌డం వ‌ల‌న నాలుగు సినిమాల‌కు ఇబ్బంది ఏర్ప‌డింది. అయితే డిక్టేట‌ర్ మూవీకి ఆడియోన్స్ నుంచి మంచి స్పంద‌న ల‌భించ‌డంతో మా డిస్ట్రిబ్యూట‌ర్స్ అంద‌రూ ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్ తోనే సేఫ్ అయ్యారు. ఇక నుంచి వ‌చ్చే క‌లెక్ష‌న్స్ అన్ని లాభాలే. సో..డిక్టేట‌ర్ మూవీకి వ‌స్తున్న రెస్పాన్స్ చూస్తుంటే మా అంద‌రికీ చాలా సంతోషంగా ఉంది.

బాల‌య్య కోస‌మే డిక్టేట‌ర్క‌ క‌థ రెడీ చేసారా..? లేక క‌థ రెడీ చేసాక బాల‌య్య అనుకున్నారా..?

బాల‌కృష్ణ గారితో సినిమా చేయాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నాను. సినిమా చేయాల‌ని చాలా సార్లు బాల‌కృష్ణ గార్ని క‌లిసాను. ఓసారి క‌లిస్తే 99వ సినిమా మ‌నం చేద్దాం అన్నారు. ఆయ‌న‌తో సినిమా చేయ‌డం ఫిక్స్ అని తెలిసిన త‌ర్వాత ఎలాంటి క‌థ‌తో చేస్తే బాగుంటుంద‌ని ఆలోచించాను. ఆఖ‌రికి ఫ్యాన్స్ కి ఫ్యామిలీ ఆడియోన్స్ కి న‌చ్చేలా డిక్టేట‌ర్ క‌థ రెడీ చేసాం.

ఫ‌స్ట్ టైం నిర్మాత అయ్యారు క‌దా...నిర్మాత‌గా మీ ఎక్స్ పీరియ‌న్స్ ఎలా ఉంది..?

నేను నిర్మాత అవ్వ‌డం అనేది అనుకోకుండా జ‌రిగింది. బాల‌కృష్ణ గారితో సినిమా అనుకున్నాకా..ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ వాళ్ల‌ను కాంటెక్ట్ చేసాం. క‌థ విని ఓకే అన్నారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ డిస్ట్రిబ్యూష‌న్ చేసింది కానీ..నిర్మాణం రంగంలో ఎంట‌రై సినిమాలు చేయ‌లేదు. అందుచేత ప్రొడ‌క్ష‌న్ చూసుకోవ‌డానికి ఇక్క‌డ ఎవ‌రైనా ఉన్నారా అని ఆలోచించి...ఫైన‌ల్ గా మీరే చేయండి అన్నారు. ఈ విష‌యాన్ని బాల‌కృష్ణ గారికి చెబితే ఓకే అని న‌న్నుచేయ‌మ‌న్నారు. అప్పుడు మా అమ్మాయి వేదాశ్య పేరుతో బ్యాన‌ర్ స్టార్ట్ చేసాను. ఆ విధంగా నేను నిర్మాత అయ్యాను.

మీ బ్యాన‌ర్ లో ఇక నుంచి రెగ్యుల‌ర్ గా సినిమాలు నిర్మిస్తారా..?

ఖ‌చ్చితంగా మా బ్యాన‌ర్ లో సినిమాలు నిర్మిస్తాను. నా బ్యాన‌ర్ లో నా డైరెక్ష‌న్ లోనే కాకుండా వేరే డైరెక్ట‌ర్స్ తో కూడా సినిమాలు నిర్మించాల‌నుకుంటున్నాను.

డిక్టేట‌ర్ క‌థ కొత్త క‌థ కాదు పాత క‌థే అంటున్నారు..మీరేమంటారు..?

బాల‌కృష్ణ గారితో సినిమా అన‌గానే ఓ కొత్త పాయింట్ తో సినిమా చేయాల‌ని అనుకోలేదు. ఎందుకంటే క‌మ‌ర్షియ‌ల్ హీరో బాల‌కృష్ణ గారితో అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా క‌థ‌ను కొత్త‌గా చెబితే చాలు అనుకున్నాను. అదే చేసాను. కొత్త హీరోతో అయితే కొత్త పాయింట్ చెప్ప‌వ‌చ్చు. బాల‌కృష్ణ గారితో కొత్త పాయింట్ తో సినిమా చేస్తే అది ఒక ప్ర‌యోగం అవుతుంది. అందుచేత సేఫ్ ఫిల్మ్ అవ్వాల‌ని ఈ క‌థ‌ను ఎంచుకున్నాను.

బాల‌కృష్ణ గారితో వ‌ర్కింగ్ ఎక్స్ పీరియ‌న్స్ ఎలా ఉంది..?

బాల‌కృష్ణ గారితో సినిమా అన‌గానే...కొంత మంది ఆయ‌న‌తో జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఆయ‌న సీరియ‌స్ గా ఉంటారు. ఇలా చాలా చెప్పారు. అయితే ఆయ‌న‌లో నేను గ‌మ‌నించింది ఏమిటంటే...ఆయ‌న చుట్టూ ఉన్న వాళ్లు నిజాయితీగా ఉండాల‌నుకుంటారు. నేను చాలా ఓపెన్ గా ఉంటాను. అది ఆయ‌న‌కు న‌చ్చింద‌నుకుంట‌..అందుచేత మా ఇద్ద‌రి మ‌ధ్య ఎలాంటి ప్రొబ్ల‌మ్ రాలేదు. ఆయ‌న కూడా సినిమా షూటింగ్ జ‌రుగుతున్నంత సేపు చాలా హ్యాపీగా ఉన్నారు.

డిక్టేట‌ర్ స‌క్సెస్ టూర్ ప్లాన్ చేసిన‌ట్టున్నారు..

అవును..డిక్టేట‌ర్ సినిమాకి వ‌స్తున్న స్పంద‌న చూసిన త‌ర్వాత స‌క్సెస్ టూర్ ప్లాన్ చేసాం. స‌క్సెస్ సంతోషాన్ని ఫ్యాన్స్ తో పంచుకోవ‌డం కోసం డిక్టేట‌ర్ టీమ్ రేప‌టి నుంచి థియేట‌ర్లో ప్రేక్ష‌కుల‌ను అభిమానుల‌ను క‌లుసుకుంటున్నాం. ఫ‌స్ట్ వైజాగ్ జ‌గ‌దాంబ థియేట‌ర్లో ప్రేక్ష‌కుల‌ను క‌లుసుకున్న త‌ర్వాత రాజ‌మండ్రి వెళ్లి ఫ్యాన్స్ క‌లుసుకుంటాం. ఆత‌ర్వాత విజ‌య‌వాడ వెళుతున్నాం. ఈ టూర్ పూర్తి అయిన త‌ర్వాత తెలంగాణ‌లో కూడా స‌క్సెస్ టూర్ ప్లాన్ చేస్తున్నాం.

డిక్టేట‌ర్ డిస్ట్రిబ్యూట‌ర్స్ కి 15% డిస్కౌంట్ ఇచ్చార‌ట‌..కార‌ణం ఏమిటి..?

సంక్రాంతికి నాలుగు సినిమాలు పోటీ ప‌డుతుండ‌డంతో థియేట‌ర్స్ అనుకున్న‌న్ని దొర‌క‌లేదు. లాస్ట్ మినిట్ లో డిస్ట్రిబ్యూట‌ర్స్ త‌మ ఇబ్బంది ఏమిటో చెప్పారు. అందుచేత డిస్ట్రిబ్యూట‌ర్స్ బాగుండాల‌నే ఉద్దేశ్యం బాల‌కృష్ణ గారితో సంప్ర‌దించి డిస్కౌంట్ నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రిగింది. దీని వ‌ల‌న మా డిస్ట్రిబ్యూట‌ర్స్ అంద‌రూ ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్ కే సేఫ్ అయ్యారు.

నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏమిటి..?

డిక్టేట‌ర్ త‌ర్వాత ఆరేంజ్ లో మ‌రో పెద్ద సినిమా చేయాల‌నే ఆలోచ‌న‌లో లేను. క‌థ బాగుంద‌నిపిస్తే చిన్న సినిమా చేయ‌డానికైనా రెడీ. త్వ‌ర‌లోనే నా నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏమిట‌నేది ఎనౌన్స్ చేస్తాను.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.