కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న 'సెబాస్టియన్' పి.సి.524

  • IndiaGlitz, [Thursday,February 03 2022]

రాజావారు రాణి గారు వంటి సూపర్ హిట్ సినిమాతో హీరోగా పరిచయమై యస్.ఆర్. కళ్యాణమండపం సినిమా తో బ్లాక్ బస్టర్ సాదించి ప్రేక్షకులలో మంచి క్రేజ్ తెచ్చుకున్న నటుడు కిరణ్ అబ్బవరం. మంచి కథలను సెలెక్ట్ చేసుకుంటూ ఎంతో బిజీ అరిస్టుగా మారిపోయాడు. తాజాగా తను నటిస్తున్న ఈ సినిమా పల్లె వాతావరణానికి, స్వచ్ఛమైన ప్రేమకథకు పెద్దపీట వేస్తుంది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో నైట్‌ బ్లైండ్‌నెస్‌ (రేచీకటి) నేపథ్యంలోని కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న కామెడీ థ్రిల్లర్ సెబాస్టియన్ PC 524. ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో జ్యోవిత సినిమాస్ పతాకంపై ప్రమోద్-రాజు లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా బాలాజీ సయ్యపురెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు.సిద్దారెడ్డి, జయచంద్రా రెడ్డి లు సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నమ్రతా దారేకర్ , కోమలి ప్రసాద్, హీరోయిన్లు గా నటిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 25 న విడుదలవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.

చిత్ర దర్శకుడు బాలాజీ సయ్యపురెడ్డి మాట్లాడుతూ.. ఇంతకుముందు గీతా ఆర్ట్స్ ,యు వి క్రియేషన్స్ లో అసోసియేట్ గా వుంటూ టాక్సీవాలా, ద్వారక సినిమాలకి పని చేశాను.ఆ తర్వాత నేను ఒక కొత్త కథ రాసుకొని చాలామందికి చెప్పడం జరిగింది.అయితే నా మ్యుచివల్ ఫ్రెండ్ ద్వారా కిరణ్ ను కలసి కథ చెప్పడం జరిగింది.సెబాస్టియన్ అను కానిస్టేబుల్ ను తనకున్న నైట్ బ్లైండ్నెస్ ద్వారా తను ఎం ఇబ్బందులను ఎదుర్కొన్నాడనే కథను చెప్పిన వెంటనే కథ బాగుందని ఈ సినిమా చేద్దామన్నాడు.మదనపల్లె రూరల్ బ్యాక్ డ్రాప్ లో చేయడం నాకు కొత్తగా అనిపించింది. 32 రోజుల్లో ఏకధాటిగా షూటింగ్ చేసి పూర్తి చేసుకున్నాము.సినిమా చాలా బాగా వచ్చింది.సినిమా చూస్తున్న మీకు కిరణ్ కనిపించడు సెబాస్టియన్ కనిపించేలా చాలా ఎక్స్ట్రార్డినరీ పర్ఫార్మెన్స్ చేశాడు.ఈ సినిమా చూసి బయటికి వచ్చిన వారందరికీ సెబాస్టియన్ క్యారెక్టర్ మీతో కొద్ది రోజులు ఉండిపోతుంది.ఇందులో ఉన్న.ప్రతి క్యారెక్టర్ కు డార్క్ షెడ్ ఉంటుంది. ఈ కథ రాసుకున్నప్పుడే జిబ్రాన్ మ్యూజిక్ ఇమేజింగ్ చేసుకును కథ రాసుకోవడం జరిగింది.ఇందులోని ఆర్ట్ వర్క్ రియలిస్టిక్ గా ఉంటుంది.నిర్మాత లు నాకు ఫుల్ సపోర్ట్ చేశారు, కిరణ్ సొంత బ్రదర్ లా నాకు సపోర్ట్ గా నిలిచాడు.కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎమోషన్,థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 25న విడుదల అవుతుంది అన్నారు.

హీరో కిరణ్ ఆబ్బవరం మాట్లాడుతూ.. రాజావారు రాణిగారు అయిపోయిన తర్వాత బాలాజీ గారు యస్ ఆర్. కళ్యాణమండపం షూట్ లోకలవడం జరిగింది.సెబా అనే క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అని ఈ కథను 15 నిమిషాలు వినగానే నచ్చి ఈ కథ చేయడానికి ఒప్పుకున్నాను.ఈ సినిమాను తెలుగు, తమిళ్ లో కూడా చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. సెబాస్టియన్ అనే క్యారెక్టర్ చాలామందికి గుర్తుండిపోతుంది. ఎందుకంటే.. చంటి సినిమా లో బ్రహ్మానందం గారు 15 నిమిషాలు రేచీకటి క్యారెక్టర్ చేస్తేనే అందరూ ఎంతో ఎంజాయ్ చేశారు. అలాంటిది ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని ఈ క్యారెక్టర్ ను చాలెంజ్ గా తీసుకుని చేస్తున్నాను.సెబాస్టియన్ సినిమా ప్రేక్షకులను 100% ఎంటర్టైన్ చేస్తుంది. ఈ సినిమా కోసం మేమంతా ప్రేక్షకుల తీర్పు ఎలా ఉండబోతోందని చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నాం.సినిమా చాలా బాగా వచ్చింది.ఇలాంటి క్యారెక్టర్ నాకు ఇంత తొందరగా దొరకడం నా అదృష్టం. సెబా క్యారెక్టర్ నేను ఎన్ని సినిమాలు చేసినప్పటికీ నా కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మదనపల్లిని కొత్తగా చూయించారు.ఈ కథ మన పక్కింటి వాడి కథలా ఉంటుంది. రాజన్న, ప్రమోద్,అన్నలు, సిద్దారెడ్డి మామ లకు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అని నాకు సపోర్ట్ గా నిలుస్తూ సినిమాలు చేస్తూ వస్తున్నారు. జిబ్రాన్ మంచి సంగీతం అందించారు హీరోయిన్ నమ్రత, కోమలి ,పాటు 24 క్రాఫ్ట్డ్ అందరూ చాలా కష్టపడి చేశారు.ఫిబ్రవరి 5 న టీజర్ రిలీజ్ చేస్తున్నాము.ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అన్నారు.

సహ నిర్మాత సిద్దారెడ్డి మాట్లాడుతూ..కిరణ్ కు వర్క్ మీదుండే డెడికేషన్ నచ్చి నా ఫ్రెండు నాగరాజు, ప్రమోద్ లతో కలసి ఈ సినిమా చేశాం. యస్ ఆర్.కళ్యాణ మండపం మూవీ చేస్తున్నప్పుడే దర్శకుడు బాలాజీ గారు ఈ కథ చెప్పడం జరిగింది. కిరణ్ బాగా చేయగలుగుతాడు అనే ఉద్దేశంతో ఈ సినిమా చేసాం. జ్యోవిత సినిమాస్ బ్యానర్ పై ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ లో మేము చేస్తున్న ఈ సినిమా మాకు మొదటి సినిమా.బాలాజీ గారు చాలా చక్కగా తీశాడు.జిబ్రాన్ మ్యూజిక్ హైలెట్ అవుతుంది. సినిమా మొత్తం మదనపల్లిలో షూట్ చేశాము.మేము అనుకున్న దానికంటే మంచి ఔట్ ఫుట్ వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఈ నెల 25 విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము అన్నారు.

నిర్మాత నాగరాజు మాట్లాడుతూ.. జ్యోవిత సినిమాస్,ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది.ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ జాబితా సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది.కిరణ్, నమ్రత, కోమలి ప్రసాద్ హీరోహీరోయిన్లుగా నటించిన శెబాస్టియన్ మూవీ తెలుగు ప్రేక్షకులు అనే పోలీస్ స్టేషన్లో ఛార్జ్ తీసుకోవడానికి ఫిబ్రవరి 25న వస్తుంది మీరందరూ మా సెబాస్టియన్ ను ఆదరించి మంచి విజయాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాను. ఇందులో నటీనటులు చాలా చక్కగా నటించారు. డైరెక్టర్ బాలాజీ, డి. ఓ.పి రాజ్, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ చాలా సపోర్ట్ చేస్తూ 32 రోజుల్లో అనుకున్న బడ్జెట్ లో సినిమా కంప్లీట్ చేయడానికి ప్రొడ్యూసర్స్ కు సహకరించారు.జీబ్రాన్ మ్యూజిక్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది.ఇలాంటి టెక్నిసిషన్స్ దొరికితే చిన్న నిర్మాతలను సేవ్ చేసిన వారవుతారు.ఈ నెల 25 న వస్తున్న ఈ సినిమా అందరినీ కచ్చితంగా అలరిస్తుందని అన్నారు.

ఎడిటర్ విప్లవ్ మాట్లాడుతూ.. సెబాస్టియన్ అనే మూవీ నాకు స్పెషల్ ప్రాజెక్ట్. కిరణ్ చాలా చక్కగా నటించాడు. బాలాజీ గారు ఫస్ట్ నుండి ప్రేక్షకులకు కొత్త కథను ఇవ్వాలని ఈ సినిమాను కొత్తగా తీశాడు.డి.ఓ.పి వర్క్ చాలా బాగుంది.త్వరలో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు.

డి.ఓ.పి.రాజ్ కె.నల్లి మాట్లాడుతూ...ఈ సెబాస్టియన్ సినిమా రెగ్యులర్ గా ఉండదు. డీఫ్రెంట్ గా ఉంటుంది.సినిమా చాలా బాగా వచ్చింది.ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు.

More News

సినిమా ప్రారంభమైన రెండు నిమిషాలకే 'సెహరి' ప్రపంచంలోకి వెళ్తారు - దర్శకుడు జ్ఞానశేఖర్‌ ద్వారక

హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి హీరో హీరోయిన్లుగా అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ‘సెహరి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు జ్ఞానశేఖర్‌ ద్వారక.

పోలీసుల ఆంక్షలు ఛేదించి.. భద్రతా వలయాన్ని దాటుకుని, బెజవాడ చేరుకున్న ఉద్యోగులు

పీఆర్సీ విషయంగా ఏపీ ప్రభుత్వానికి- ఉద్యోగ సంఘాలకు మధ్య వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. పలు దఫాలుగా వారిని చర్చలకు ఆహ్వానించినా.. ఉద్యోగులు మాత్రం హాజరుకాలేదు.

గ్రాండ్‌గా మహేశ్- త్రివిక్రమ్ మూవీ లాంచ్

సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ఖుషీ అయ్యే న్యూస్.. దాదాపు 12 ఏళ్ల తర్వాత మహేశ్- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మూవీ పట్టాలెక్కింది. SSMB 28 వర్కింగ్ టైటిల్‌తో వున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు గురువారం

ఇంకా రిలీజ్ కాలేదు.. అప్పుడే ఓటీటీ గురించి టాక్, సర్కార్ వారి పాటను అమెజాన్ కొనేసిందా..?

సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరో పరశు రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘‘సర్కార్ వారి పాట’’ సినిమా ఎట్టకేలకు రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. సమ్మర్ కనుకగా మే 12న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్

ఎన్టీఆర్-బుచ్చిబాబు సినిమాకు టైటిల్ ఇదేనా.. గురువుదారిలో ఉప్పెన డైరెక్టర్..?

ఆర్ఆర్ఆర్ కారణంగా దాదాపు మూడేళ్ల పాటు అభిమానులకు దూరమయ్యారు. ఇంత ఎదురుచూసినప్పటికీ ఆర్ఆర్ఆర్ మాత్రం రిలీజ్ కాకపోవడంతో ఫ్యాన్స్ మరింత నిరాశకు గురవుతున్నారు.