వాట్సాప్‌‌లో సరికొత్త ఫీచర్.. అంతా మీ ఇష్టమే

  • IndiaGlitz, [Saturday,February 16 2019]

వాట్సాప్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇప్పటికే పలు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ వినియోగదారులను రోజురోజుకు పెంచుకుంటూ పోతున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్ని ఫీచర్లు వస్తున్నప్పటికీ గ్రూప్స్ నుంచి వచ్చే సందేశాల విషయంలో యూజర్స్ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి విరుగుడు కనుగొన్న సదరు సంస్థ.. వినియోగదారులకు బ్రహ్మాండమైన సదుపాయాన్ని అందించబోతోంది. ప్రస్తుతం ఈ వాట్సాప్‌‌ను 1.3 బిలియన్ల మంది వాడుతున్నారు.

ఇక ఆ ఇబ్బందులు ఉండవ్..

ఒక యూజర్‌‌కు ఒకే మెసేజ్‌ను పది గ్రూపుల ద్వారా తిప్పి తిప్పి వందసార్లు వస్తుంటుంది.. దీంతో విసిగెత్తిపోతున్న వాట్సాప్‌ యూజర్లకు నిజంగా ఇది ఒక మంచి ఫీచరే అని చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక గ్రూపులోకి మిమ్మల్ని ఎవరైనా యాడ్ చేశారనుకోండి.. యాడ్ అయిన తర్వాత ఎగ్జిట్ తప్ప మరో మార్గం లేదు.. ఇది ఇప్పటి వరకూ ఉన్న కథ.

అంతా మీ ఇష్టమే..

అయితే తాజాగా.. ఎవరైనా గ్రూప్‌‌లో చేసినట్లయితే డైరెక్ట్ యాడ్ అయ్యేకి లేదు.. ఎందుకంటే గ్రూపులో చేరాలా వద్దా? అనేది ఇకపై వాట్సాప్‌ వినియోగదారుల చేతుల్లోనే ఉండేలా కొత్త ఫీచర్ రాబోతోంది. ఎవరు బడితే వారు, ఇష్టమొచ్చినట్లుగా గ్రూపుల్లో యాడ్‌ చేయకుండా నియంత్రించేలా వాట్సాప్‌ మూడు ఆప‍్షన్లను యూజర్లకు అందుబాటులోకి తెస్తోంది. వాబేటా ఇన్ఫో.కాం అందించిన సమాచారం ప్రకారం ఇన్విటేషన్‌ ఫీచర్‌ను జోడించనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా.. ఇప్పటికే ఈ ఫీచర్‌ను వాట్సాప్‌ బిజెనెస్‌లో అమలు చేస్తుండగా.. అదనపు భద్రత కోసం వాట్సాప్‌లో కూడా తీసుకురాబోతున్నట్లు సదరు యాప్ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. సో.. దీన్ని బట్టి చూస్తే గ్రూప్స్‌లో ఎవరు యాడ్ చేసినా అసలు యాడ్ అవ్వాలా అనేది మన చేతుల్లోనే ఉందన్న మాట.

ఇదిగో ఆఫ్షన్లు ఇలా ఉంటాయ్..

1. నోబడీ(Nobody) : ఎవరికీ మిమ్మల్ని గ్రూపులో యాడ్ చేసే అవకాశం ఉండదు

2. మై కాంటాక్ట్స్‌(My Contacts) : మీ ఫోన్‌‌లో ఉండే కాంటాక్ట్స్‌లో ఉన్న వారు మాత్రమే యూజర్‌ను గ్రూపులో యాడ్‌ చేసేందుకు అనుమతినివ్వడం.

3. ఎవ్రీవన్‌ (Every One) : అంటే యూజర్‌ పరిచయం లేకపోయినా.. కాంటాక్ట్స్‌లో లేకపోయినా గ్రూపులో యాడ్‌ చేసేలా అనుమతినివ్వడం.

పై మూడింటినీ బట్టి చూస్తే.. నో బడీ, మై కాంటాక్ట్స్ ఓన్లీ అనే ఆఫ్షన్లు సూపర్బ్‌గా ఉన్నాయి. పైగా ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఎక్కువ శాతం మంది ఈ రెండు ఆఫ్షన్లు వాడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ టైమ్‌‌లో, వాట్సాప్ పోటీగా పలు మేసేజింగ్ యాప్‌‌లు కొల్లగా పెరిగిపోవడంతో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ సరికొత్త ఫ్యూచర్లను వినియోగదారులకు అందిస్తోంది. మొత్తానికి చూస్తే వినియోగదారులకు శుభవార్తే కాదు.. బ్రహ్మాండమైన సదుపాయం అని చెప్పుకోవడంలో ఎలాంటి అశియోక్తి లేదేమో.

More News

జయరామ్ మృతదేహాన్ని చూసి పరుగులు తీశారు!

ప్రముఖ ఎన్నారై, ఎక్స్‌ప్రెస్ టీవీ చైర్మన్ హత్యకేసులో గంటకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. మొదట ఈ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా రాకేశ్ రెడ్డిని పోలీసులు నిర్ధారించిన సంగతి తెలిసిందే.

జేమ్స్ బాండ్ 25వ చిత్రం రిలీజ్ డేట్‌.. ఎఫెక్ట్ ప‌డ్డ మ‌రో చిత్రం..

జేమ్స్ బాండ్ చిత్రాల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంటాయ‌నే సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు ఏడుగురు హీరోలు జేమ్స్ బాండ్‌లుగా న‌టించి మెప్పించారు.

ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడుకు క్లీన్ ‘U’ ఫిబ్రవరి 22న విడుదల

నంద‌మూరి బాల‌కృష్ణ‌, విద్యాబాల‌న్ జంట‌గా న‌టించిన సినిమా ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు. ఎన్టీఆర్ బ‌యోపిక్ లో రెండో భాగంగా వ‌స్తున్న‌ ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు

టీడీపీకి భారీ షాక్.. వైసీపీలో చేరిన కీలకనేత

టీడీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీకి టాటా చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.

కాకినాడ ఎంపీ అభ్యర్థిని ఫిక్స్ చేసిన జనసేనాని

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ త‌ర‌పున బ‌రిలోకి దిగ‌ద‌ల‌చిన ఆశావ‌హుల బ‌యోడేటాల స్క్రీనింగ్ ప్ర‌క్రియ గత మూడ్రోజులు కొన‌సాగుతున్న సంగతి తెలిసిందే.