close
Choose your channels

ధోనీ ఉండటం అదృష్టం.. విమర్శించడం దురదృష్టం: కొహ్లీ

Friday, April 19, 2019 • తెలుగు Sport News Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీపై కొందరు పనిగట్టుకుని మరీ అనవసర విమర్శలకు దిగుతున్న విషయం విదితమే. దీంతో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహానికి లోనైన టీమిండియా కెప్పటెన్ విరాట్ కొహ్లీ ఎట్టకేలకు స్పందించాడు. ధోనీ పై ఇలా అనవసర విమర్శల చేయడం దురదృష్టకరమన్నారు. గురువారం ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విరాట్.. ధోనీ ప్రస్తావన తెచ్చాడు.

క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సమయంలో తనకు ధోనీ ఇచ్చిన మద్దతు అత్యంత కీలకమని అన్నాడు. టీమ్‌లో చాలా మంది మూడో స్థానంలో బ్యాటింగ్ కోసం ఎదురుచూస్తున్న క్రమంలో ధోనీ తనకు అవకాశం కల్పించారని ఈ సందర్భంగా కొహ్లీ గుర్తు చేసుకున్నాడు. ఇలా తనకు నంబర్ 3 ఇవ్వడం కెప్టెన్ నమ్మకం వల్లేనని విరాట్ చెప్పుకొచ్చాడు.

ధోనీ.. తొలి బంతి నుంచి 300వ బంతి వరకు ఆటను చాలా బాగా అధ్యయనం చేస్తారన్నాడు. ధోనీ లాంటి వ్యక్తి టీమిండియాలో ఉండడం ఎంతో భాగ్యమని తాను చెప్పట్లేదు కానీ వికెట్ల వెనుక అలాంటి చురుకైన బుర్ర ఉండడం నిజంగా అదృష్టమే అని విరాట్ చెప్పుకొచ్చాడు. ఫీల్డింగ్ మొదలుకుని బ్యాటింగ్ ఇలా అన్నింట ముఖ్యంగా బౌలింగ్‌ మార్పుల గురించి అతడు చూసుకుంటాడని.

ఇది మా ఇద్దరి మధ్య ఉండే నమ్మకం, పరస్పర అవగాహనకు అద్దంపడుతుందని విరాట్ చెప్పాడు. సో.. ఒకప్పుడు కొహ్లీకి మద్దతుగా నిలిచిన ధోనీ.. ఇప్పుడు విరాట్ ఆయనకు మద్దతుగా నిలిచాడన్న మాట. సో.. ఏదేమైనప్పటికీ ధోనీని విమర్శించడం సాటి ఆటగాళ్లకే కాదు క్రీడాభిమానులకు కూడా నచ్చట్లేదు. ఇకనైనా విమర్శలు తగ్గించి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.