ధోనీ ఉండటం అదృష్టం.. విమర్శించడం దురదృష్టం: కొహ్లీ

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీపై కొందరు పనిగట్టుకుని మరీ అనవసర విమర్శలకు దిగుతున్న విషయం విదితమే. దీంతో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహానికి లోనైన టీమిండియా కెప్పటెన్ విరాట్ కొహ్లీ ఎట్టకేలకు స్పందించాడు. ధోనీ పై ఇలా అనవసర విమర్శల చేయడం దురదృష్టకరమన్నారు. గురువారం ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విరాట్.. ధోనీ ప్రస్తావన తెచ్చాడు.

క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సమయంలో తనకు ధోనీ ఇచ్చిన మద్దతు అత్యంత కీలకమని అన్నాడు. టీమ్‌లో చాలా మంది మూడో స్థానంలో బ్యాటింగ్ కోసం ఎదురుచూస్తున్న క్రమంలో ధోనీ తనకు అవకాశం కల్పించారని ఈ సందర్భంగా కొహ్లీ గుర్తు చేసుకున్నాడు. ఇలా తనకు నంబర్ 3 ఇవ్వడం కెప్టెన్ నమ్మకం వల్లేనని విరాట్ చెప్పుకొచ్చాడు.

ధోనీ.. తొలి బంతి నుంచి 300వ బంతి వరకు ఆటను చాలా బాగా అధ్యయనం చేస్తారన్నాడు. ధోనీ లాంటి వ్యక్తి టీమిండియాలో ఉండడం ఎంతో భాగ్యమని తాను చెప్పట్లేదు కానీ వికెట్ల వెనుక అలాంటి చురుకైన బుర్ర ఉండడం నిజంగా అదృష్టమే అని విరాట్ చెప్పుకొచ్చాడు. ఫీల్డింగ్ మొదలుకుని బ్యాటింగ్ ఇలా అన్నింట ముఖ్యంగా బౌలింగ్‌ మార్పుల గురించి అతడు చూసుకుంటాడని.

ఇది మా ఇద్దరి మధ్య ఉండే నమ్మకం, పరస్పర అవగాహనకు అద్దంపడుతుందని విరాట్ చెప్పాడు. సో.. ఒకప్పుడు కొహ్లీకి మద్దతుగా నిలిచిన ధోనీ.. ఇప్పుడు విరాట్ ఆయనకు మద్దతుగా నిలిచాడన్న మాట. సో.. ఏదేమైనప్పటికీ ధోనీని విమర్శించడం సాటి ఆటగాళ్లకే కాదు క్రీడాభిమానులకు కూడా నచ్చట్లేదు. ఇకనైనా విమర్శలు తగ్గించి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

More News

నిండు సభలో హార్థిక్ పటేల్‌కు ఘోర అవమానం!

ఎన్నికల సీజన్ వచ్చిందంటే చాలు రాజకీయ నేతలు చేసే హడావుడి మామూలుగా ఉండదు.

నీరజ్ పాండే చేతుల మీదుగా ప్రియమణి "సిరివెన్నెల" టీజర్ లాంచ్ 

ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకొని... తనదైన విభిన్మన పాత్రలతో మెప్పించిన ప్రియమణి... తెలుగులో పలు కమర్షియల్ చిత్రాల్లో కూడా నటించి అభిమానుల్ని సంపాదించుకుంది.

తెలుగు బిగ్‌బాస్-3 కంటెస్టెంట్ల జాబితా వచ్చేసిందోచ్!?

బిగ్‌బాస్-3 సీజ‌న్‌కు సమయం ఆసన్నమవ్వడంతో ఈ సారి హోస్ట్‌గా ఎవరు ఉండబోతున్నారు..?

బిగ్‌బాస్-3 హోస్ట్‌గా స్టార్ హీరో ఫిక్స్..!?

తెలుగులో బిగ్‌బాస్ 1,2 షోలు ఏ రేంజ్‌లో సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వన్‌కు జూనియర్ ఎన్టీఆర్..

చెర్రీకి ప్లాప్.. చంద్రబాబుకు హిట్ ఇచ్చిన బోయపాటి!?

టైటిల్ చూడగానే ఇదేంటి..? అని ఆశ్చర్యపోతున్నారా.. అవును మీరు వింటున్నది అక్షరాలా నిజమే.