వ‌రుణ్ చిత్రంలో కోలీవుడ్ హీరో...

  • IndiaGlitz, [Monday,February 18 2019]

హృద‌యం సినిమా పేరు వినే ఉంటారు. ఆ సినిమా హీరో ముర‌ళి. ఆయ‌న త‌న‌యుడు అధ‌ర్వ ముర‌ళి త‌మిళంలో హీరోగా రాణిస్తున్నాడు. ఇప్పుడు అధ‌ర్వ ముర‌ళి తెలుగులో కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడ‌ని స‌మాచారం. వివ‌రాల్లోకెళ్తే.. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన 'జిగ‌ర్‌తండా'ను తెలుగులో 'వాల్మీకి' పేరుతో రీమేక్ చేస్తున్నారు.

14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కించ‌బోయే ఈ సినిమాలో వ‌రుణ్‌తేజ్ గ్యాంగ్‌స్టర్ పాత్ర చేస్తున్నాడు. మ‌రో హీరో పాత్ర కోసం నాగ‌శౌర్య‌, శ్రీవిష్ణు పేర్లు ప్ర‌ముఖంగా విన‌ప‌డ్డాయి. అయితే ఇప్పుడు ఆ పాత్ర కోసం ద‌ర్శ‌కుడు హ‌రీష్ కోలీవుడ్ యువ హీరో అధ‌ర్వ‌ముర‌ళిని క‌లుసుకున్నాడ‌ట‌. అత‌ను ఒప్పుకున్నాడో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. సినిమాల్లో న‌టించాల‌నుకొనే గ్యాంగ్‌స్ట‌ర్‌కు, డైరెక్ట‌ర్ కావాల‌నుకునే అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌కు మ‌ధ్య జ‌రిగే క‌థే ఈ చిత్రం.