close
Choose your channels

వ‌రుణ్ చిత్రంలో కోలీవుడ్ హీరో...

Monday, February 18, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వ‌రుణ్ చిత్రంలో కోలీవుడ్ హీరో...

హృద‌యం సినిమా పేరు వినే ఉంటారు. ఆ సినిమా హీరో ముర‌ళి. ఆయ‌న త‌న‌యుడు అధ‌ర్వ ముర‌ళి త‌మిళంలో హీరోగా రాణిస్తున్నాడు. ఇప్పుడు అధ‌ర్వ ముర‌ళి తెలుగులో కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడ‌ని స‌మాచారం. వివ‌రాల్లోకెళ్తే.. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన `జిగ‌ర్‌తండా`ను తెలుగులో `వాల్మీకి` పేరుతో రీమేక్ చేస్తున్నారు.

14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కించ‌బోయే ఈ సినిమాలో వ‌రుణ్‌తేజ్ గ్యాంగ్‌స్టర్ పాత్ర చేస్తున్నాడు. మ‌రో హీరో పాత్ర కోసం నాగ‌శౌర్య‌, శ్రీవిష్ణు పేర్లు ప్ర‌ముఖంగా విన‌ప‌డ్డాయి. అయితే ఇప్పుడు ఆ పాత్ర కోసం ద‌ర్శ‌కుడు హ‌రీష్ కోలీవుడ్ యువ హీరో అధ‌ర్వ‌ముర‌ళిని క‌లుసుకున్నాడ‌ట‌. అత‌ను ఒప్పుకున్నాడో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. సినిమాల్లో న‌టించాల‌నుకొనే గ్యాంగ్‌స్ట‌ర్‌కు, డైరెక్ట‌ర్ కావాల‌నుకునే అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌కు మ‌ధ్య జ‌రిగే క‌థే ఈ చిత్రం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.