‘అన్న’ అలా.. ‘తమ్ముడు’ ఇలా.. కోమటి బ్రదర్స్ దారెటు!

  • IndiaGlitz, [Tuesday,June 18 2019]

కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారంటూ గత కొన్నిరోజులు పెద్ద ఎత్తున వార్తలు రావడంతో పాటు.. ఇటీవల రాజగోపాల్ రెడ్డి ఈ వ్యవహారంపై దాదాపు కన్ఫామ్ చేసేసిన సంగతి తెలిసిందే. అయితే తమ్ముడు మాత్రం కాంగ్రెస్‌కు టాటా చెప్పే యోచనలో ఉండగా.. అన్న మాత్రం కట్టె కాలే వరకు కాంగ్రెస్‌లోనే ఉంటానని శపథం చేశారు. దీంతో ‘తమ్ముడు’ అలా.. ‘అన్న’ ఇలా చేస్తుండటంతో అభిమానులు ఏం జరుగుతోందో దిక్కు తోచట్లేదు. ఒకే ఇంట్లో ఇలా ఎందుకు జరుగుతోంది..? అసలేంటి ఈ వ్యవహారం..? అని సొంత కుటుంబ సభ్యులకు సైతం అసలేం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి. అయితే ఈ పుకార్లు, మీడియాలో వస్తున్న వార్తలన్నింటికీ.. ఢిల్లీ వేదికగా మీడియాతో మాట్లాడి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్లారిటీ ఇస్తారని అందరూ భావించారు. ఉన్నట్టుండి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో ప్రత్యక్షమవ్వడంతో ఇక చేరిక కన్ఫామ్ అయిపోయినట్లేనని గుసగుసలు వినిపించాయి. అయితే తెలంగాణలో ఒక మాట.. ఢిల్లీలో మరో మాటతో రాజగోపాల్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు.

అబ్బే అదేం లేదు..!

ఢిల్లీ వేదికగా రాజగోపాల్ మీడియాతో ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. నా ఢిల్లీ పర్యటనకు ఎలాంటి ప్రాధాన్యం లేదు. అన్న భువనగిరి నుంచి గెలిచిన ఎంపీగా వెంకటరెడ్డి ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా నేను ఢిల్లీకి వచ్చాను. నేను బీజేపీలో చేరికపై ఇంకా ఫైనల్‌గా నిర్ణయం తీసుకోలేదు. ఏ నిర్ణయం తీసుకున్నా, అభిమానులు కార్యకర్తలను సంప్రదించిన తర్వాతే తీసుకుంటాను.. అంతేకాని నేను స్వతహాగా నిర్ణయం తీసుకోను. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మోహన్ రెడ్డి తరహాలో తెలంగాణలో కూడా కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేసి ఉంటే అధికారంలోకి వచ్చి ఉండేది. నాకు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి ఉంటే కూడా హస్తం పార్టీకి ఈ గతి పట్టేది కాదు అని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. కాగా... సోమవారం నాడు ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా పలువురు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.

అన్న రియాక్ట్ అవ్వడేం!

అయితే బాహాటంగా తమ్ముడు కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేసినప్పటికీ ఇంత జరుగుతున్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం రియాక్ట్ కాకపోవడం వెనుక సమ్‌థింగ్ ఈజ్ రాంగ్ అని అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు అంటున్నారు. ఇదిలా ఉంటే కోమటిరెడ్డి బ్రదర్స్‌ లేదా రేవంత్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించాలని అధిష్టానం అనుకుంటోందని అందుకే ఆయన్ను ఢిల్లీకి పిలిపించిందని మరోవైపు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరో రెండ్రోజుల్లో అసలు కాంగ్రెస్ పగ్గాలు కోమటిరెడ్డి బ్రదర్స్ చేతికి వస్తాయా..? లేకుంటే కమలం కండువా కప్పుకుని ఎంచక్కా వెళ్లిపోతారా..? అనేదానిపై స్పష్టత రావాలంటే వేచి చూడాల్సిందే మరి.

More News

తూచ్.. అవన్నీ పుకార్లే అంటున్న సుహాసిని!

ప్రముఖ దర్శకుడు మణిరత్నం గుండెపోటుతో ఆసుపత్రిలో చేరినట్టు సోమవారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున వార్తలు హడావుడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలను ఆయనకు

వైఎస్ జగన్ గిఫ్ట్‌ను కాదనలేకపోయిన కేటీఆర్!

తెలంగాణ సీఎం కేసీఆర్ అమరావతిలో పర్యటించిన సంగతి తెలిసిందే. కేసీఆర్‌ వెంట తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, రాజ్యసభ సభ్యుడు సంతోష్, మాజీ ఎంపీ వినోద్‌ ఉన్నారు.

శ‌ర్వాకు ఆప‌రేష‌న్ పూర్తి.. 2 నెల‌ల పాటు బెడ్ రెస్ట్‌

`96` సినిమా చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా థాయ్‌లాండ్‌లో స్కై డైవింగ్ ప్రాక్టీస్ చేస్తుండ‌గా, భుజానికి, కాలికి గాయాలైన సంగ‌తి తెలిసిందే.

'మ‌మాంగం' గురించి మ‌మ్ముట్టి ఏమ‌న్నారంటే?

మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మ‌మ్ముట్టి ప్ర‌స్తుతం `మ‌మాంగం` అనే భారీ హిస్టారిక‌ల్ మూవీలో న‌టిస్తున్నారు.

యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'రాజా నరసింహా'

మమ్ముటీ, జై, మహిమా నంబియర్‌ కీలక పాత్రధారులుగా మలయాళంలో తెరకెక్కిన ‘మధురరాజా’ చిత్రాన్ని ‘రాజా నరసింహా’