'కొండవీటి దొంగ' కు 28 ఏళ్ళు

  • IndiaGlitz, [Friday,March 09 2018]

''ఉన్నవాడిని కొల్లగొట్టి లేనివాడికి పెట్టు" అనే రాబిన్ హుడ్ సిద్ధాంతంతో తెరకెక్కిన చిత్రం 'కొండవీటి దొంగ'. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే మరో మైలురాయిగా నిలిచిన హిట్ మూవీ ఇది. విజయశాంతి, రాధ క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ చిత్రంలో శారద, శ్రీవిద్య, సత్యనారాయణ, రావుగోపాల్ రావు, మోహన్ బాబు, అమ్రీష్ పూరి ముఖ్య పాత్ర‌లు పోషించారు. ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు.

ఇక కథలోకి వెళితే.. అనాథైన కొండవీటి రాజా(చిరంజీవి) కొండవీడు ప్రజల అండదండలతో ఐ.ఏ.ఎస్. చదువుతాడు. కాని ఆ ప్రాంతంలో భూస్వాములైన శరభోజీ(రావుగోపాలరావు), నరసింహం(మోహన్ బాబు) ఆగడాలవల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతూ ఉంటారు. చట్టప్రకారం వారిని ఎదిరించలేమని తెలుసుకున్న రాజా 'కొండవీటి దొంగ'గా మారతాడు. పోలీస్ ఆఫీసర్ అయిన శ్రీలేఖ(విజయశాంతి).. అండర్ కవర్ ఆపరేషన్ తో 'కొండవీటి దొంగ'ను పట్టుకోవడానికి కొండవీడు వస్తుంది.

శ్రీలేఖ చెల్లెలు, డాక్టరైన శ్రీకన్య(రాధ) కొండవీడు ప్రాంతంలో ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించడానికి వచ్చి రాజాయే 'కొండవీటి దొంగ'ని తెలుసుకుంటుంది. వీరిద్దరూ రాజాను ప్రేమిస్తారు. 'కొండవీటి దొంగ'గా మారిన రాజా తను అనుకున్న పనిని పూర్తిచేశాడా? శ్రీలేఖ 'కొండవీటి దొంగ'ను పట్టుకోగలిగిందా? వీరిద్దరిలో రాజా ఎవరి ప్రేమను పొందాడు? అసలు రాజా అనాథగా మారడానికి కారకులు ఎవరు? అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానమే ఈ చిత్రం.

'కొండవీటి దొంగ'గా చిరంజీవి గెటప్ ఆకట్టుకుంటుంది. ఇళయరాజా స్వరపరచిన పాటలన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ చిత్రంలోని "శుభలేఖ రాసుకున్న" పాటను 'నాయక్' సినిమాలో.. "చమక్ చమక్" పాటను 'ఇంటిలిజెంట్' సినిమాలో రీమిక్స్ చేశారు. మార్చి 9, 1990న విడుదలైన ఈ చిత్రం.. నేటితో 28 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.

More News

మీ లైక్స్ కోసం ఇలా చేయకండి: శ్రీకాంత్

ఇటీవల సోషల్ మీడియా లో కొంతమంది చేస్తున్న అకృత్యాలను చూస్తుంటే మీడియా పైనే విసుగుపుట్టేలా అనిపించడం ఖాయం.. వారి వీడియోలకు లైకులు రావడం  కోసం, వ్యూస్ పెరగడం కోసం కొన్ని సంస్థలు చేస్తున్న తీరు ఆడియోన్స్ నే కాదు సెలెబ్రెటీలను సైతం చిరాకు తెప్పిస్తోంది..  గాసిప్స్  అంటే కొంత తెలిసి మరికొంత తెలియని విషయాన్ని ఆరోగ్యకరంగా చెప్పడమో.. లే

విడుదలకు సిద్ధమైన మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు'

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'అభిమన్యుడు'. ఎం.పురుషోత్తమన్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై జి.హరి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు.

నాలో ప్రేమ‌ నువ్వేనా లొగొ లాంఛ్

జై చిరంజీవ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై వాసు దేవ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తొన్న చిత్రం‌ "నాలో ప్రేమ నువ్వేనా". చిత్రీకరణ పూర్తి చెసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

విజ‌య్ దేవ‌ర‌కొండ 'నోటా'

నోటా అంటే రాజ‌కీయాల్లోని వ్యక్తుల‌కు బాగా తెలుసు. న‌న్ ఆఫ్ ది అబౌ అప్ష‌న్‌. పైన ఉన్న వ్య‌క్తులు కారు అనే అర్థంలో ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ నోటా ఓటును ప్ర‌వేశ పెట్టిన సంగ‌తి తెలిసింది.

కాజ‌ల్‌తో పాట పాడుకుంటున్న క‌ళ్యాణ్ రామ్‌

కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న సినిమా 'ఎం.ఎల్.ఎ.' మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి అన్నది ట్యాగ్ లైన్. ఈ చిత్రంతో ఉపేంద్ర మాధవ్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్, కాజల్ పై ఒక పాటను చిత్రీకరిస్తున్నారు.