close
Choose your channels

విడుదలకు సిద్ధమైన మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు'

Thursday, March 8, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'అభిమన్యుడు'. ఎం.పురుషోత్తమన్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై జి.హరి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు.

యూత్‌స్టార్‌ నితిన్‌ విడుదల చేసిన మొదటి పాట

ఈ చిత్రంలోని మొదటి పాటను యూత్‌స్టార్‌ నితిన్‌ ఈరోజు సాయంత్రం 5 గంటలకు విడుదల చేశారు. 'తొలి తొలిగా తొలకరి చూసి పిల్లాడ్నై.. విప్పారిన కన్నుల్తో లోకాన్నే చూశా..' అంటూ సాగే ఈ పాటను శ్రేష్ట రచించగా, యువన్‌ శంకర్‌ రాజా సంగీత సారధ్యంలో జితిన్‌రాజ్‌ ఆలపించారు.
ఈ సందర్భంగా హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ అధినేత జి.హరి మాట్లాడుతూ ''హీరో నితిన్‌గారు ఈ చిత్రంలోని మొదటి పాటను విడుదల చేశారు. యువన్‌ శంకర్‌రాజా అద్భుతమైన సంగీతాన్ని అందించారు.

విశాల్‌ కెరీర్‌లోనే హయ్యస్ట్‌ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం'' అన్నారు. మాస్‌ హీరో విశాల్‌, సమంత, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌తోపాటు భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తోంది.

ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: జార్జి సి. విలియమ్స్‌, ఎడిటింగ్‌: రూబెన్‌, ఫైట్స్‌: దిలీప్‌ సుబ్బరాయన్‌, ఆర్ట్‌: ఉమేష్‌ జె.కుమార్‌, మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి, సహ నిర్మాత: ఇ.కె.ప్రకాశ్‌, నిర్మాత: జి.హరి, దర్శకత్వం: పి.ఎస్‌.మిత్రన్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.