'కొత్తగా ఉన్నాడు' ఆడియో వేడుక

  • IndiaGlitz, [Wednesday,February 14 2018]

తమిళ సినిమాలతో బిజీగా ఉన్న అందాల కథానాయకుడు ఆకాష్ తాజాగా తెలుగులో నటించిన చిత్రం 'కొత్తగా ఉన్నాడు'. రాజా మీడియా వరల్డ్ సమర్పణలో జై బాలాజీ మూవీ మేకర్స్ పతాకంపై ఎం.కె.రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆకాష్ సరసన ప్రియ, సోనియా హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి ఎం.రాధా దర్శకత్వం వహించారు. యు.కె.మురళి సంగీతం సమకూర్చారు.

ఈ చిత్రం ఆడియో వేడుక ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ ధియేటర్ లో ఘనంగా జరిగింది. ఆడియోతోపాటు ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఈ వేడుకలో హీరో ఆకాష్, నిర్మాత ఎం.కె.రాజా, సంగీత దర్శకుడు యు.కె.మురళి, ప్రముఖ నిర్మాత, సంతోషం పత్రికాధినేత సురేష్ కొండేటి, వైకుంఠపాళి నిర్మాత జైరామ్, నటుడు-నిర్మాత దినేష్ మాడ్నే, యువ దర్శకుడు రవిశర్మ, నిర్మాతలు బాల్ రెడ్డి, బలవంత్ రెడ్డి, హీరోయిన్స్ ఆర్తి సురేష్, సుమ, లక్కీ, కొరియోగ్రాఫర్ వేణు పాల్గొన్నారు.

సినిమా టైటిల్ లానే ఆకాష్ చాలా కొత్తగా ఉన్నాడని, ఈ సినిమాతో అతనికి మళ్ళీ పెద్ద హిట్ రావాలని వేడుకలో పాల్గొన్నవారంతా ఆకాక్షించారు.
లండన్ నేపథ్యంలో జరిగే ఈ కథలో ఆంద్ర కుర్రాడిగా, తెలంగాణ కుర్రాడిగా రెండు షేడ్స్ కలిగిన పాత్రలో నటించానని, విక్రమ్ అరిచితుడి తరహాలో అందర్నీ అలరిస్తుందని' ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే కూడా సమకూర్చిన హీరో ఆకాష్ అన్నారు.

ఆకాష్ గారి ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మరువలేనని, 'కొత్తగా ఉన్నాడు' చిత్రానికి అన్ని పాటలు బాగా కుదిరాయని మ్యూజిక్ డైరెక్టర్ యు.కె.మురళి అన్నారు. 'కొత్తగా ఉన్నాడు' చిత్రంతో తెలుగు సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతుండడం ఆనందంగా ఉందని, ఈ చిత్రంతో తనకు మంచి బోణి లభిస్తుందనే నమ్మకం ఉందని నిర్మాత ఎం.కె.రాజా అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: షాన్, ఎడిటింగ్: ప్రేమ్.

More News

సైకలాజికల్ లవ్ స్టోరీగా మసక్కలి

కొన్ని కథలు విని నమ్ముతాం..కొన్ని కథలు చూసి నమ్ముతాం..మరికొన్ని కథలు చూసినా నమ్మలేని విధంగా ఉంటాయి..

'47 డేస్' ఫస్ట్ సాంగ్ ని లాంచ్ చేసిన పూరి

ప్రదీప్ మద్దాలిని దర్శకుడిగా పరిచయం చేస్తూ టైటిల్ కార్డ్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న సినిమా '47 డేస్'..  "ది మిస్టరీ అన్ ఫోల్డ్స్" అనేది ట్యాగ్ లైన్..సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ నుండి "క్యా కరూన్" అని సాగే మొదటి పాటను వాలెంటైన్స్ డే సందర్భంగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విడుదల చేశారు..రఘు కుంచె స్వరపరచి

'తొలి ప్రేమ‌' స‌క్సెస్ మీట్‌

బాపినీడు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.వి.సి.సి బ్యాన‌ర్‌పై మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, రాశీ ఖ‌న్నా జంట‌గా న‌టించిన సినిమా 'తొలి ప్రేమ‌'. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ ప్ర‌సాద్ నిర్మాత‌. ఈ సినిమా థాంక్స్ మీట్ బుధ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది.

నాలుగోవారం కూడా కొన‌సాగేనా?

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కి ఈ ఏడాది సంక్రాంతి సీజ‌న్ పెద్ద‌గా అచ్చి రాక‌పోయినా.. జ‌న‌వ‌రి చివ‌రి వారం నుంచి బాగానే క‌లిసొస్తోంది. మ‌రీ ముఖ్యంగా.. వారానికో సినిమా విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతుండ‌డం విశేషం. జ‌న‌వ‌రి 26న అనుష్క న‌టించిన భాగ‌మ‌తి చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది.

ఒకే రోజున‌ ముగ్గురు స్టార్ హీరోల వాయిస్ ఓవ‌ర్స్‌

ఒక స్టార్ హీరో సినిమాకి మరో స్టార్ హీరో, ఒక స్టార్ డైరెక్టర్ సినిమాకి మరో స్టార్ హీరో వాయిస్ ఓవర్ ఇస్తే!?...ఈ రెండు కూడా గతంలో 'జల్సా', 'మర్యాద రామన్న' సినిమాలో చూసాం.   మళ్ళీ ఇలాంటి మ్యాజిక్ రిపీట్ కాబోతోంది.. ఈ శుక్రవారం (ఫిబ్రవరి 16) విడుదల కానున్న 'మనసుకు నచ్చింది', 'అ!' సినిమాలతో. ఈ రెండు సినిమాలు కూడా కొత్త దర్శకులు తెరకెక్కించిన చిత్రాలే కావ