close
Choose your channels

'47 డేస్' ఫస్ట్ సాంగ్ ని లాంచ్ చేసిన పూరి

Wednesday, February 14, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రదీప్ మద్దాలిని దర్శకుడిగా పరిచయం చేస్తూ టైటిల్ కార్డ్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న సినిమా '47 డేస్'.. "ది మిస్టరీ అన్ ఫోల్డ్స్" అనేది ట్యాగ్ లైన్..సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ నుండి "క్యా కరూన్" అని సాగే మొదటి పాటను వాలెంటైన్స్ డే సందర్భంగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విడుదల చేశారు..రఘు కుంచె స్వరపరచిన ఈ గీతానికి సాహిత్యం లక్ష్మీ భూపాల్ అందించారు.ఈ మెలోడియస్ లవ్ సాంగ్ ను సింగర్ నీహా కడివేటి పాడారు.

సత్య దేవ్, పూజా ఝావేరి, రోషిని ప్రకాష్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ మూవీకి దబ్బార శశిభూషన్ నాయుడు, రఘుకుంచే, శ్రీధర్ మక్కువ, విజయ్ శంకర్ డొంకాడ నిర్మాతలు..గ్రిప్పింగ్ నేరేషన్ తో సాగే ఈ కథ ప్రేక్షకుల్ని ఆద్యాంతం థ్రిల్ చేస్తుందని చిత్ర యూనిట్ అంటుంది. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకొన్న ఈమూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.. గోవా, వైజాగ్, అరకు, లక్నవరంఅండ్ హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ లో బిగ్ బాస్ హరితేజ, రవివర్మ, శ్రీకాంత్ అయ్యంగార్,ఇర్ఫాన్, బేబి అక్షర, ముక్తార్ ఖాన్, సత్య ప్రకాష్,
కిరీటి, అశోక్ కుమార్, తదితరులు నటిస్తున్నారు.

నటీనటులు:
సత్యదేవ్, పూజా ఝావేరి, రోషిణి, రవి వర్మ,బిగ్ బాస్ హరితేజ,ఇర్ఫాన్, బేబి అక్షర,శ్రీకాంత్ అయ్యంగార్, ముక్తార్ ఖాన్, సత్య ప్రకాష్, కిరీటి, అశోక్ కుమార్, సాంకేతక వర్గం:పబ్లిసిటీ డిజైనర్స్: అనీల్ భాను, స్క్రిప్ట్ అసిస్టెంట్స్ : కిరణ్ కట్టా, హరీష్ సజ్జా,ఫస్ట్ఎడి:రాజ్ కుమార్ కోసన, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: నానాజి పెట్లా,పిఆర్వో: సురేష్ కుమార్, పబ్లిసిటీ ఇన్ ఛార్జ్: విశ్వ సియమ్, లిరిక్స్: భాస్కర్ బట్ల, లక్ష్మీ భూపాల్,విశ్వ,కొరియోగ్రఫీ: నిక్సన్ డిక్రూజ్, స్టంట్స్: స్టంట్స్ శ్రీ, ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మకడలి, ఎడిటర్: ఎస్.ఆర్. శేఖర్, మ్యూజిక్: రఘుకుంచే. సినిమాటోగ్రఫీ: జీకెకో ప్రొడ్యూసర్ : అనిల్కుమార్ సోహని,నిర్మాతలు:దబ్బారశశిభూషన్నాయుడు,రఘుకుంచే,శ్రీధర్మక్కువ,విజయ్శంకర్ డొంకాడ, కథ,కథనం,మాటలు,దర్శకత్వం : ప్రదీప్ మద్దాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.