'కృష్ణమనోహర్ ఐ.పి.ఎస్' మార్చి 6న విడుద‌ల

  • IndiaGlitz, [Tuesday,March 03 2020]

అటు ద‌ర్శ‌కుడిగా ఇటు కొరియోగ్రాఫర్ గా అలానే హీరోగా కూడా మ‌ల్టీటాలెంట్స్ తో దూసుకుపోతున్న ప్రభుదేవా తొలిసారిగా ఓ పోలీస్ గెటెప్ లో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ప్రభుదేవా హీరోగా నటించిన పొన్ మానిక‌వ‌ల్ అనే‌ తమిళ చిత్రాన్ని తెలుగులో 'కృష్ణమనోహర్ ఐ.పి.ఎస్' పేరుతో మార్చి 6న‌ విడుదల చేస్తున్నారు. ఈ మాస్ మసాలా ఎంటర్ టైనర్ ను, పవనపుత్ర ప్రొడక్షన్స్ పతాకంపై యనమల సుధాకర్ నాయుడు సమర్పణలో సీనియర్ ప్రొడ్యూసర్ ఆర్. సీతారామరాజు తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ప్ర‌భుదేవ‌కు జోడీగా డ‌స్కీ బ్యూటీ ఫేమ్ నివేదా పేతురాజ్ న‌టిస్తోంది.

ఇటీవ‌లే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ మూవీ అల వైకుంఠ‌పుర‌ములో నివేదా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో హీరో హీరోయిన్ తో పాటు బాహుబలి ప్రభాకర్, సురేష్ మీనన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. భారీ రేంజ్ లో ఈ చిత్రాన్ని మార్చి 6న తెలుగు ఆడియెన్స్ కి ముందుకు తీసుకువ‌స్తున్నామ‌ని, కొరియోగ్రాఫర్ గా, హీరోగా, దర్శకుడిగా పలు సంచలన విజయాలు సాధించిన ప్రభుదేవా తొలిసారి డేర్ డెవిల్ పోలీస్ ఆఫీసర్ గా సంఘ విద్రోహశక్తుల పాలిట సింహస్వప్నంగా నిలిచే పవర్ ఫుల్ పాత్రలో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాడని, నిర్మాత ఆర్.సీతారామరాజు తెలిపారు.

More News

‘స్కల్ బ్రేకర్’ ఛాలెంజ్‌తో యూత్ బీ కేర్ ఫుల్..

‘స్కల్ బ్రేకర్’ ఛాలెంజ్ లేదా ‘ట్రిప్పింగ్ జంప్’ పట్ల ప్రజలు ముఖ్యంగా యువత ఆకర్షితులవ్వడం ఆందోళన కలిగిస్తోందని..

అడ్డంగా బుక్కయిన విరాట్ కోహ్లీ!

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ తరుచూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాడు. ఇప్పటికే పలుమార్లు మీడియా ముందు, మైదానంలో

గ్రామ వలంటీర్లపై లోకేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు

లబ్ధిదారులకు ఇంటి వద్దకే పెన్షన్‌ అందజేసి ‘గ్రామ వలంటీర్లు’ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

‘వకీల్‌ సాబ్’కు పోటీగా ‘డైరెక్టర్ సాబ్’ వచ్చేశాడు!

పవర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ 26వ చిత్రానికి ‘వ‌కీల్ సాబ్’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేసిన సంగతి తెలిసిందే. బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్,

భారత్‌లో కరోనా.. హైదరాబాద్‌కూ వచ్చేసింది!

కరోనా వైరస్ లేదా కోవిడ్-19 పేరు వింటేనే ప్రపంచం వణికిపోతోంది.. చైనాలోని వూహాన్‌లో వచ్చిన ఈ వైరస్ ఖండాలను దాటేసి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది.