షూటింగ్‌లో విజయ్ దేవరకొండ, సమంతకు ప్రమాదం.. క్లారిటీ ఇచ్చిన ‘ఖుషీ’ టీమ్

  • IndiaGlitz, [Tuesday,May 24 2022]

సోషల్ మీడియా రాకతో ఏది నిజమో ... ఏది అబద్ధమో తెలుసుకోవడం జనాలకు ఇబ్బందిగా మారుతోంది. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే బ్యాచ్ ఇటీవల కాలంలో ఎక్కువైంది. దీని కారణంగా తప్పుడు వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇలాంటి వారి వల్ల సెలబ్రెటీలు, ప్రముఖులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన వారే ఇలాంటి వారికి టార్గెట్ అవుతున్నారు. తాజాగా హీరోయిన్ సమంత, హీరో విజయ దేవరకొండలకు ప్రమాదం జరిగిందంటూ వార్తలు గుప్పుమన్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ ఖుషి అనే ఓ లవ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గడిచిన కొద్దిరోజులుగా కాశ్మీర్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

అయితే కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ఓ యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా సమంత, విజయ్‌లు గాయపడినట్లుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. షూటింగ్ నిమిత్తం వీరిద్దరూ ఓ నదికి ఇరువైపులా కట్టిన తాడు బ్రిడ్జిపై వాహనాన్ని డ్రైవ్ చేయాలి. అయితే ఆ వాహనం అదుపు తప్పడంతో సమంత, విజయ్‌లు నదిలో పడిపోయారని.. ఈ ఘటనలో వీరిద్దరికి స్వల్ప గాయాలైనట్లు నిన్నటి నుంచి కథనాలు వస్తున్నాయి.

ఈ నేఫథ్యంలో చిత్ర యూనిట్ స్పందించింది. విజయ్ దేవరకొండ, సమంతకు గాయాలు అంటూ జరుగుతోన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. కాశ్మీర్‌లో షూటింగ్ చేసుకుని యూనిట్ మొత్తం క్షేమంగా హైదరాబాద్‌ వచ్చేసిందని ఖుషీ యూనిట్ పేర్కొంది. రెండో షెడ్యూల్ అతి త్వరలోనే మొదలు కానుందని...దయచేసి ఎలాంటి పుకార్లు నమ్మొద్దు చిత్ర యూనిట్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. కాగా.. ఈ సినిమాను కిస్మస్ కానుకగా తెలుగు , తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో డిసెంబర్ 23న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

More News

‘శేఖర్’ మూవీ వివాదంలో జీవితా రాజశేఖర్‌దే గెలుపు.. న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు

యాంగ్రీ యంగ్‌మెన్ డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించిన మూవీ శేఖర్. ఆయన కెరీర్‌లో ఇది 91వ సినిమా.

దిగ్గజ నటుడు టీ.రాజేందర్‌కు తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చికిత్స

దిగ్గజ నటుడు, నిర్మాత, దర్శకుడు టీ.రాజేందర్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది.

ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న విజయ్ దేవరకొండ, సమంత 'ఖుషి'

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ సినిమా "ఖుషి" ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

ఇకపై మహిళల కోసం సినిమాలు చేస్తా .. పెద్ద కలలు కనండి: భారతీయ అమ్మాయిలకు పూజా హెగ్డే సూచనలు

ప్రస్తుతం సౌత్‌తో పాటు నార్త్‌లోనూ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది పూజాహెగ్డే. ‘‘ఒక లైలా కోసం’’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది

వనజీవి రామయ్యకు పవన్ పరామర్శ.. వీడియో కాల్ చేసి యోగక్షేమాలు తెలుసుకున్న జనసేనాని

రోడ్డు ప్రమాదానికి గురై ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ పర్యావరణ పరిరక్షకుడు, పద్మశ్రీ వనజీవి రామయ్యను జనసేన అధినేత పవన్ కళ్యాణ్