'లక్ష్మీస్ ఎన్టీఆర్' వాయిదా

  • IndiaGlitz, [Tuesday,March 19 2019]

అనుకున్న‌ట్లే అయ్యింది. దివంగ‌త నేత ఎన్టీఆర్ జీవితంలో చ‌ర‌మాంక ద‌శ‌లో ఎదుర్కొన్న రాజ‌కీయ ఆటు పోట్ల‌ను, ల‌క్ష్మీ పార్వ‌తిని పెళ్లి చేసుకున్న త‌ర్వాత ఆయ‌న జీవితంలో చోటు చేసుకున్న ప‌రిణామాల‌ను దృష్టిలో పెట్టుకుని రాంగోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క నిర్మాణంలో తెర‌కెక్కించిన చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్‌'.

ఈ చిత్రానికి దీప్తి బాల‌గారి, రాకేష్ రెడ్డి నిర్మాణంలో భాగ‌స్వామ్యం వ‌హిస్తే.. అగ‌స్త్య మంజు వ‌ర్మ‌తో స‌హా సినిమాను డైరెక్ట్ చేశాడు. సినిమాను మార్చి 22న విడుద‌ల చేయాల‌నుకున్నారు. కానీ సెన్సార్ బోర్డ్ ఎన్నిక‌లు త‌ర్వాతే సినిమాను విడుద‌ల చేయాల‌ని ఆదేశించింది.

దీంతో వ‌ర్మ లీగ‌ల్‌గా ప్రొసీడ్ అవుతాన‌ని చెప్ప‌డంతో సెన్సార్ బోర్డు లైన్‌లోకి వ‌చ్చిన రెండు, మూడో రోజుల్లో సినిమాను చూసి స‌ర్టిఫై చేస్తామ‌ని చెప్పింది. సినిమా స‌ర్టిఫై చేసిన త‌ర్వాత కాస్త స‌మ‌యం తీసుకుంటుంది కాబ‌ట్టి.. సినిమాను అనుకున్న‌ట్లుగా మార్చి 22న విడుద‌ల చేయ‌లేరు. దీంతో రాంగోపాల్‌వ‌ర్మ సినిమాను మార్చి 29న విడుద‌ల చేయబోతున్న‌ట్లు ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు.

More News

బిగ్‌బాస్ 3లో నాగ్...?

హిందీ నుండి తెలుగులోకి వ‌చ్చిన తొలి రియాలిటీ షో బిగ్ బాస్‌. స్టార్ మా వారు నిర్వ‌హిస్తున్న ఈ రియాలిటీ షో ఇప్ప‌టికి రెండు సీజ‌న్స్‌ను పూర్తి చేసుకుంది.

తెలుగులో రీమేక్ కానున్న బాలీవుడ్ చిత్రం...

గ‌త ఏడాది అమిత్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఫ్యామిలీ కామెడీ డ్రామా 'బ‌దాయి హో'. 30 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ  సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద స‌క్సెస్‌

అమ్మాయికి మంచి జీవితాన్ని ఇస్తా...

మంచు మోహన్ బాబు పుట్టిన‌రోజు నేడు. ఈ రోజును పుర‌స్క‌రించుకుని ఆయ‌న రెండో త‌న‌యుడు మంచు మ‌నోజ్ ఓ మంచి ప‌నికి శ్రీకారం చుట్టాడు. సిరిసిల్ల గ్రామానికి చెందిన అశ్విత

ఆలియా క‌ల నిజ‌మాయే

తొమ్మిదేళ్ల వ‌య‌సులో మహేష్ భ‌ట్ కుమార్తె ఆలియా భ‌ట్ సంజ‌య్ లీలా భ‌న్సాలి ఆఫీసులోకి అడుగు పెట్టింది. అప్ప‌టి నుండి ఆయ‌న సినిమాల్లో న‌టించాల‌ని క‌ల‌లు కంది.

రెండు స్థానాల్లో పవన్ పోటీ.. ప్రకటించిన జనసేన

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు స్థానాల్లో పోటీ చేస్తారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సేమ్ టూ సేమ్ ‘అన్నయ్య’ రెండు స్థానాల్లో పోటీచేస్తారని ముందుగా లీకులొచ్చాయి.