పోలీసుల‌కు లావ‌ణ్య త్రిపాఠి కంప్లైంట్‌

  • IndiaGlitz, [Tuesday,March 17 2020]

త‌న‌ను పెళ్లి చేసుకున్నానంటూ చెబుతున్న వ్య‌క్తిపై హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి ఫిర్యాదు చేశారు. సైబ‌రాబాద్ పోలీసుల‌కు మెయిల్ ద్వారా లావ‌ణ్య త్రిపాఠి కంప్లైంట్ చేశారు. వివ‌రాల్లోకెళ్తే.. శ్రీరామోజు సునిశిత్ అనే వ్య‌క్తిని రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి, తాను ప్రేమ‌లో ఉన్న‌ట్లు పెళ్లి కూడా చేసుకున్న‌ట్లు మాట్లాడాడు. ఈ విష‌యం తెలిసిన లావ‌ణ్య త్రిపాఠి స‌ద‌రు వ్య‌క్తిపై సైబ‌ర్‌క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

ఆ కంప్లైంట్‌పై సైబ‌ర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘స‌ద‌రు శ్రీరామోజు సునిశిత్ యూ ట్యూబ్ ఛానెల్స్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూస్‌లో ప‌రిశీలించామ‌ని.. లావ‌ణ్య కేసును స్వీక‌రించి విచార‌ణ చేస్తున్నామ‌ని, మ‌హిళ‌ల గురించి త‌ప్పుగా మాట్లాడితే శిక్ష త‌ప్ప‌ద‌ని ఆయ‌న తెలిపారు. సునిశిత్ లావ‌ణ్య‌తోపాటు ఇత‌ర సెల‌బ్రిటీల‌పై కూడా వ్యాఖ్య‌లు చేశార‌ని తెలిపారు.

లావ‌ణ్య త్రిపాఠి గ‌త ఏడాది నిఖిల్ హీరోగా నటించిన‌ అర్జున్ సుర‌వరం చిత్రంతో స‌క్సెస్ సాధించింది. ఇప్పుడు సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తోన్న ఏ1 ఎక్స్‌ప్రెస్ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇవీ కాకుండా ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌కీల్‌సాబ్‌లోనూ లావ‌ణ్య పేరుని హీరోయిన్‌గా ప‌రిశీలిస్తున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

More News

పోలీసులు వేధిస్తున్నారని కోర్టు మెట్లెక్కిన కమల్

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘భారతీయుడు-2’ సినిమా సెట్‌లో కొన్ని రోజులు క్రితం ఘోర ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

నా బర్త్ డే వేడుకలు వాయిదా వేస్తున్నా : కలెక్షన్ కింగ్

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ భారీన పడి వందల సంఖ్యలో చనిపోగా..

ఇలా జీవించాల్సి వస్తుండటం చాలా బాధాకరం..!

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ భారీన పడి వందల సంఖ్యలో చనిపోగా..

కరోనా ఎఫెక్ట్ : నేటి నుంచి షిరిడీ ఆలయం మూసివేత

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా యావత్ భారతదేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి.

ఏపీ సర్కార్‌కు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన నిమ్మగడ్డ!

కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఆదివారం నాడు కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిదే.