గ్రామ వలంటీర్లపై లోకేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు

  • IndiaGlitz, [Monday,March 02 2020]

లబ్ధిదారులకు ఇంటి వద్దకే పెన్షన్‌ అందజేసి ‘గ్రామ వలంటీర్లు’ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆదివారం తెల్లవారు జామున నుంచే పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన వాలంటీర్లు మధ్యాహ్నం 2 గంటల వరకూ 47 లక్షల మందికి ఇళ్ల వద్దే పెన్షన్లు అందజేయడం విశేషం. దేశంలో ఇలాంటి వాలంటీర్ వ్యవస్థ కానీ.. ఇంటికే పెన్షన్ ఇవ్వడం కానీ లేదు. ఒక్కరోజులోనే 87.37 శాతానికి పైగా పింఛన్లు పంపిణీ చేశారు. దీనిపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే ఇంత జరుగుతున్న టీడీపీ మాత్రం ఈ గ్రామ వలంటీర్ వ్యవస్థను తీవ్రంగా తప్పుబడుతున్నారు. అంతేకాదు.. సోషల్ మీడియా వేదికా తిట్టి పోస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

దండుపాళ్యం గ్యాంగ్‌లు అంటూ..!
‘వలంటీర్లలో 90 శాతం మంది వైసీపీ కార్యకర్తలే ఉన్నారు. వలంటీర్లు అత్యాచారాలు చేసినా, పాపాలు చేసినా వైసీపీ ఆశీస్సులున్నాయ‌ని అర్థం అవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అప్పగించిన బాధ్యత‌ల‌ను దండుపాళ్యం గ్యాంగుల్లా పూర్తి చేస్తున్న వలంటీర్లకు వైసీపీ హ్యాట్సాఫ్ చెప్పడంలో వింతేముంది?’ అని లోకేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు వ్యవసాయం కూడా ఈయన ట్వీట్ చేశారు.

హ్యాట్సాప్ చెప్పిన విజయసాయి!
ఇదిలా ఉంటే గ్రామ వలంటీర్ వ్యవస్థను పొగుడుతూ వారికి హ్యాట్సాఫ్ చెబుతూ వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ‘గ్రామ వలంటీర్లెంత? వాళ్ల జీతాలెంత? పెళ్లి చేసుకోవాలంటే సంబంధం కూడా దొరకదని హేళన చేశాడు చంద్రబాబు. అప్రయోజకుడైన ఆయన పుత్రరత్నం నాలుగున్నర లక్షల మంది వలంటీర్లలో ఒక్కరితో కూడా సరితూగలేడు. సిఎం జగన్ గారు అప్పగించిన బాధ్యతను సైనికుల్లా నిర్వర్తిస్తున్నారు. హాట్సాఫ్..’ అంటూ విజయసాయి ట్వీట్ చేశారు. ఇందుకు స్పందించిన లోకేశ్ పై విధంగా ట్వీట్ చేశారు.

కన్నబాబు స్ట్రాంగ్ కౌంటర్!
ఇదిలా ఉంటే.. మంత్రి కురసాల కన్నబాబు.. లోకేశ్‌కు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ‘సంక్షేమ పథకాల అమలులో పెన్షన్ల పంపిణీ ఓ రికార్డ్. తెల్లవారకముందే తలుపు తట్టి పెన్షన్లు అందజేశాం. టీడీపీని ప్రజలు తిరస్కరించబట్టే 23 స్థానాలకు పడిపోయింది. జగన్‌ రైతు వ్యతిరేకి అనడానికి లోకేష్‌కి నోరు ఎలా వచ్చింది..?. వ్యవసాయం దండగన్న చంద్రబాబు మాటలు మర్చిపోయారా?. బీసీ రిజర్వేషన్లపై టీడీపీ వాళ్లే కోర్టుకు వెళ్లారు. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల కేసులో టీడీపీ ఎందుకు ఇంప్లీడ్‌ కాలేదు’ అని కన్నబాబు కౌంటర్ ఇచ్చారు.

More News

‘వకీల్‌ సాబ్’కు పోటీగా ‘డైరెక్టర్ సాబ్’ వచ్చేశాడు!

పవర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ 26వ చిత్రానికి ‘వ‌కీల్ సాబ్’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేసిన సంగతి తెలిసిందే. బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్,

భారత్‌లో కరోనా.. హైదరాబాద్‌కూ వచ్చేసింది!

కరోనా వైరస్ లేదా కోవిడ్-19 పేరు వింటేనే ప్రపంచం వణికిపోతోంది.. చైనాలోని వూహాన్‌లో వచ్చిన ఈ వైరస్ ఖండాలను దాటేసి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది.

కాల్ రాగానే హీరోయిన్ ముంబై ఎందుకెళ్లింది.. అసలు కథ ఇదీ!?

‘రాహు’ మూవీ హీరోయిన్ కృతి గార్గ్‌‌కు ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ పేరుతో ఓ వ్యక్తి కాల్ చేసి ట్రాప్ చేశాడని వార్తలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

కరోనాపై అతి వీడియో ఏంటి చార్మీ.. సబబేనా!?

కరోనా వైరస్ లేదా కోవిడ్-19 పేరు వింటేనే ప్రపంచం వణికిపోతోంది.. చైనాలోని వూహాన్‌లో వచ్చిన ఈ వైరస్ ఖండాలను దాటేసి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది.

నిర్భయ నిందితుల ఉరి మళ్లీ వాయిదా

దేశ రాజధాని న్యూ ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనలోని నిందితుల ఉరిశిక్ష ఇప్పట్లో అమలు అయ్యే పరిస్థితులు కనిపించట్లేదు.